ETV Bharat / entertainment

'ఆ దెబ్బలు తట్టుకోలేకపోయాను - ఈ సినిమానే వద్దనుకున్నాను' - Janhvi Kapoor Mr And Mrs Mahi - JANHVI KAPOOR MR AND MRS MAHI

Janhvi Kapoor Latest Interview : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' అనే సినిమాతో అభిమానులను అలరించేందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

Janhvi Kapoor Latest Interview
Janhvi Kapoor Latest Interview (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 7:00 AM IST

Updated : Jun 7, 2024, 7:25 AM IST

Janhvi Kapoor Latest Interview : అందాల తార శ్రీ దేవి తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్​. ఫ్యామిలీ మొత్తం సినీ నేపథ్యం నుంచే అయినా కూడా ఈ చిన్నది తన యాక్టింగ్, హార్డ్​ వర్క్​తో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో అటు బాలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లో బిజీగా ఉన్న ఈ స్టార్, తాజాగా 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' అనే సినిమాతో అభిమానులను అలరించేందుకు వచ్చింది.

ఓ వ్యక్తి తన కలల్ని నిజం చేసుకోవడానికి తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంత అవసరమో అనే నేపథ్యంలో సాగిన ఈ సినిమా మే 31న రిలీజైంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

"ఈ సినిమా కోసం నేను క్రికెట్​లో శిక్షణ తీసుకున్నాను. అలా నా కోచ్‌లు నన్ను ఈ క్రీడకు ఫ్యాన్​గా మార్చేశారు. ఇందులో క్రికెట్‌కు సంబంధించిన సీన్స్ షూట్​ చేసే టైమ్​లో నాకు ఎన్నోసార్లు గాయాలయ్యాయి. వాటిని తట్టుకోలేక కొన్నిసార్లు నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నాను. కానీ ఆ తర్వాత మనసు మార్చుకొని, వాటన్నింటినీ అధిగమించి ప్రతి సీన్​ను నేచురల్​గా వచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. అంతే కాకుండా ఈ పాత్ర కోసం నేను మానసికంగా, శారీరకంగానూ ఎన్నో కసరత్తులు చేశాను. ఇప్పటివరకు నటించిన పాత్రలన్నింటి కన్నా, ఈ మహిమ పాత్రలో నేను రెండింతల ఉత్సాహాన్ని, అనుభూతిని పొందాను. మునుపెన్నడూ ఏ పాత్ర కోసం ఇలా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ నటించలేదు" అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది.

ఇక ఈ సినిమాలో జాన్వీతో పాటు రాజ్​కుమార్ రావ్​ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైరెక్టర్ శరణ్​ శర్మ రూపొందించిన ఈ సినిమాకు విశాల్ మిశ్రా, తనిష్క్ బగ్చీ లాంటి మ్యూజిక్ కంపోజర్స్ చక్కటి సంగీతాన్ని అందించారు. ఇందులోని పాటలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి.

'నన్ను ఆ దుస్తుల్లో చూడటం ఇష్టం లేదు- అలా ఫొటోలు తీయకండి'- జాన్వీ సీరియస్ - Janhvi Kapoor Photos

క్రికెట్ బాల్​తో స్టార్ హీరో పళ్లు విరగొట్టిన జాన్వీ! - Janvi Kapoor

Last Updated : Jun 7, 2024, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.