Janhvi Kapoor Discharged : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యిందని ఆయన తండ్రీ బోనీ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే ఊంటూ విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. "ఫుడ్ పాయిజన్ కారణంగా జాన్వీ అస్వస్థతకు గురైంది. గురువారం ఈ ఘటన జరగ్గా మేము ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. అక్కడ చికిత్స తీసుకుని ఆరోగ్యం మెరుగుపడ్డాక నిన్న ఉదయం జాన్వీని ఇంటికి తీసుకొచ్చాం"అంటూ బోనీ కపూర్ తాజాగా మీడియాతో చెప్పారు.
అసలేం జరిగిందంటే?
గతకొంత కాలంగా బిజీ షెడ్యూల్స్ గడుపుతున్న జాన్వీ, జులై 18న అస్వస్థతకు గురైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు జాన్వీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆమె ఫుడ్ పాయిజన్‌కు గురైనట్టు డాక్టర్లు తెలిపినట్లు సమాచారం. దీంతో చికిత్స తర్వాత ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యింది.
జాన్వీ డిశ్చార్జ్ అయ్యిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమె కోలుకున్నందున సంతోషిస్తున్నారు. స్పీడ్‌గా రికవర్ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వరగా మిమ్మల్ని షూటింగ్ స్పాట్లో చూడాలంటూ కోరుకుంటున్నారు.
ఇటీవలే జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరిచింది. కలెక్షన్ల పరంగా కాస్త ఫర్వాలేదనిపించింది.
మరోవైపు జాన్వీ 'దేవర'తో పాటు 'ఉలఝ్', 'సన్నీ సంస్కారీకి తులసీకుమారీ' ఇలా మూడు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో రెండూ షూటింగ్ జరుపుకుంటుండగా, మరొకటి మాత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
తాజాగా అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుకల్లో ఈమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్‌తో పాటు పెళ్లిలోనూ యాక్టివ్‌గా పాల్గొని సందడి చేసింది. తన సోదరి ఖుషి కపూర్, అలాగే రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు, సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అంతేకాకుండా ఈ వేడుకల కోసం జాన్వీ ధరించిన డిజైనర్ దుస్తులు కూడా ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకర్షించాయి.