ETV Bharat / entertainment

అక్కినేని హీరోతో జాన్వీకపూర్​! - ఏ సినిమా కోసం అంటే? - JANVHI KAPOOR NAGA CHAITANYA

మరో టాలీవుడ్​ హీరో నాగ చైతన్య సినిమాలో జాన్వీ కపూర్​ నటించే అవకాశం!

Naga Chaitanya Janvhi Kapoor
Naga Chaitanya Janvhi Kapoor (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 9:37 AM IST

Janvhi Kapoor Naga Chaitanya Movie : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్​ టాలీవుడ్​పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పలువురు తెలుగు దర్శకనిర్మాతలు కూడా జాన్వీతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్​గా ఈ ముద్దుగుమ్మ 'దేవర' చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. దేవర మూవీ సెట్స్​పై ఉన్నప్పుడే​ తన నెక్స్ట్ తెలుగు చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేసేందుకు ఓకే చెప్పింది. అయితే, ఇప్పుడు ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.

ఆ ప్రాజెక్ట్ ఏంటంటే? - జాన్వీ కపూర్​ అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. చైతూ ప్రస్తుతం నటిస్తున్న తండేల్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో ఎలాగైనా పెద్ద సాలిడ్​ హిట్ అందుకోవాలని నాగ చైతన్య శ్రమిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత ఓ సింపుల్ లవ్ స్టోరీలో నటించాలని చైతూ అనుకుంటున్నారట. దర్శకుడు శివ నిర్వాణ దీన్ని తెరకెక్కిస్తారని, ఇప్పటికే ఓ కథను సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసమే హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలని శివ నిర్వాణ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో నాగ చైతన్యతో కలిసి శివ నిర్వాణ బ్లాక్ బస్టర్ హిట్ మజిలీని తెరకెక్కించారు. చూడాలి మరి ఈ కాంబోలో సినిమా సెట్ అవుతుందా? ఒకవేళ సెట్ అయితే అందులో జాన్వీ నటిస్తుందా? అనేది.

అలానే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్‌ ఓదెల కాంబోలో హిట్ మూవీ దసరా తర్వాత రెండో చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథా నాయిక ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే మొదట జాన్వీ కపూర్‌ పేరే గట్టిగా ప్రచారం సాగింది. మరి ఇందులో ఏమైనా నటిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ చిత్రం సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ కథ అని తెలుస్తోంది. దసరాతో పోలిస్తే వంద రెట్లు అధిక ప్రభావం చూపించే కథ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

'లక్కీ భాస్కర్‌' రివ్యూ - సినిమాకే అది హైలైట్

'క' రివ్యూ - కిరణ్‌ అబ్బవరం కొత్త కాన్సెప్ట్​ సినిమా ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.