Actress Meena Kumari Life : తెలుగు సినీ పరిశ్రమలో తర తరాలకు గుర్తుండిపోయే నటనతో మెప్పించి, ఒకానొక సమయంలో హీరోలు కూడా తన కాల్షీట్స్ కోసం వెయిట్ చేసేలా చేసిన హీరోయిన్ సావిత్రి. డబ్బును, ఆమెకు ఉన్న క్రేజ్‌ను సరిగ్గా వినియోగించుకోవడం తెలియని సావిత్రి మద్యానికి బానిసై కటిక దరిద్రంలో తనువు చాలించారు. బాలీవుడ్ అలనాటి హీరోయిన్లలో ఒకరైన మీనా కుమారిది కూడా దాదాపుగా అలాంటి కథే. కాదుకాదు అంతకంటే దారుణమైన కథ ఈమెది.
1933లో అలీ బక్స్, ఇఖ్బాల్ బేగంలకు పుట్టారు మీనా కుమారి. కుమారుడు కావాలని ఆశపడిన తండ్రి, కుమార్తె పుట్టడం వల్ల హాస్పిటల్ ఫీజు కట్టకుండా వెళ్లిపోయాడు. అలా ఆమెను హాస్పిటల్ వాళ్లే అనాథాశ్రమంలో చేర్పించారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చిన తండ్రి ఆరేళ్ల వయస్సులోనే సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. ఒక్క ఈమె సంపాదనతోనే కుటుంబం గడిచేది. ఈమెకు 25ఏళ్ల వయస్సున్నప్పుడు లీడింగ్ నటిగా చెలామణీ అవుతూ ప్రతి సినిమా కథ ఆమె కాదంటేనే వేరే వాళ్లకు వెళ్లేంత ప్రియారిటీ దక్కించుకున్నారు. శారద, సహారా, దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయ్, కాజల్, సాహిబ్ బీబీ ఔర్ ఘులామ్ లాంటి ఎమోషనల్ సినిమాల్లో కనిపించి మెప్పించారు.
అయితే సినిమానే జీవితం అయిపోయిన ఆమెకు 18ఏళ్ల వయస్సున్నప్పుడు నిర్మాత అయిన 33 ఏళ్ల కమల్ ఆమ్రోహీ పరిచయం అయ్యాడు. అప్పటికే పెళ్లి అయిన కమల్ ఆమ్రోహీ ఈమెతో సీక్రెట్‌గా డేటింగ్ చేసి 1952లో వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లి అయిన తర్వాత యాక్టింగ్ చేయకూడదంటూ టార్చర్ చేయడం మొదలు పెట్టాడు ఆమ్రోహీ. అలా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి వాదనలు, కొట్లాటలు వరకూ పరిస్థితి మారిపోవడం వల్ల విడాకులు తీసుకున్నారు. అలా విడిపోయిన తర్వాత కూడా సినిమాల్లో నటించారు మీనా కుమారి. తమాషా, బైజు బావ్రా లాంటి చిత్రాలతో ఆమె క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా పరినీత, చాందినీ చౌక్, ఆజాద్, ఏక్ హై రాస్తా చిత్రాలతో మెప్పించారు. 1968లో బహరోన్ కీ మంజిల్ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఫినిష్ అయిపోయింది.
చివరికి మద్యానికి బానిసై సినిమా సెట్స్‌లోకి కూడా ఆమె ఆల్కహాల్ తీసుకొచ్చుకునేవాళ్లట. అప్పటికీ సినిమాలు తీస్తూనే ఉన్నా 1971లో రిలీజ్ అయిన మేరే అప్నే తప్పించి మిగిలినవన్నీ ప్లాపే. పర్సనల్ లైఫ్‌లో సమస్యల కారణంగా మద్యానికి బానిస కావడం వల్ల లివర్ చెడిపోయినప్పటికీ 1972లో రిలీజ్ అయిన పాకీఝా సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బ్లాస్టర్ సక్సెస్ సాధించింది. కానీ, అది రిలీజ్ అయిన కొద్ది వారాలకే ఆమె లివర్ జబ్బుతో బాధపడుతూ 38 ఏళ్లకే కనుమూశారు.
ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సింగ్ సినిమా - ఆ రూమర్స్‌లో నిజం లేదు - Ranveer Singh Prasanth Varma Movie