ETV Bharat / entertainment

అప్పుడు రూ.50 కోసం స్టేజ్​షో- ఇప్పుడు పాటకు రూ.10లక్షలు- సక్సెస్ అంటే ఇది! - Neha Kakkar Career - NEHA KAKKAR CAREER

Neha Kakkar Career: పాపులర్ సింగర్‌ నేహా కక్కర్‌ పాటలు చాలా మంది వినే ఉంటారు. కానీ ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటాయి. ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.

Neha Kakkar Career
Neha Kakkar Career (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 7:21 PM IST

Neha Kakkar Career: అందరి లక్ష్యాలు, కోరికలు ఒకేలా ఉండవు. విభిన్న రంగాల్లో రాణించాలని, గుర్తింపు పొందాలని కలలు కంటుంటారు. కానీ సక్సెస్‌ అంత సులువుగా లభించదు. నిరంతర కృషి, పట్టుదలతోనే అనుకున్నది సాధించగలరు. ఈ మాటలు సింగర్‌ నేహ కక్కర్​ జీవితానికి సరిగ్గా సరిపోతాయి. ఆమె చిన్నప్పటి నుంచి, తన కుటుంబాన్ని పోషించడానికి పాటలు పాడుతోంది. ఆమె తండ్రి సమోసాలు అమ్మేవాడు. కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆమె భక్తి పాటలు పాడుతూ రోజుకు రూ.50 సంపాదించిన ఆమె, ఇప్పుడు ఆమె ఇండియాలో పాపులర్‌ సింగర్​గా పేరొందింది. మరి ఆమె కెరీర్ లైఫ్​ గురించి మీకు తెలుసా?

నేహా కక్కర్‌ బాల్యం: ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్‌లో 1988 జూన్ 6న నేహా కక్కర్ జన్మించింది. సింగర్‌ అవ్వాలనే ఆమె కోరికను నిజం చేయడానికి, కుటుంబం 1990ల ప్రారంభంలో దిల్లీకి మారింది. నేహా కక్కర్‌ కేవలం నాలుగు సంవత్సరాల వయస్సులో స్థానిక కార్యక్రమాలు, మతపరమైన సమావేశాల్లో, పెళ్లిల్లలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. 2004లో నేహా, ఆమె సోదరుడు టోనీ ముంబయికి వెళ్లారు. రెండు సంవత్సరాల తర్వాత, పద్దెనిమిదేళ్ల వయస్సులో ఆమె ఇండియన్ ఐడల్ రెండో సీజన్‌ ఆడిషన్స్‌కి హాజరైంది. కాంపిటీషన్‌ ప్రారంభంలోనే ఎలిమినేట్‌ అయింది.

వ్యక్తిగత జీవితం: నేహా కక్కర్, నటుడు హిమాన్ష్ కోహ్లీ 2014లో డేటింగ్ ప్రారంభించారు. 2018 సెప్టెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారని బహిరంగంగా ప్రకటించారు. అయితే, కేవలం మూడు నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. కొంతకాలం తర్వాత, నేహా చండీగఢ్‌లో పంజాబీ సంగీత కళాకారుడు రోహన్‌ప్రీత్ సింగ్‌తో ప్రేమలో పడింది. వాళ్లు 2020 అక్టోబర్ 24న న్యూ దిల్లీలోని గురుద్వార వేడుకలో పెళ్లి చేసుకున్నారు. నేహా కక్కర్‌ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ పాపులర్ సింగర్‌గా గుర్తింపు పొందింది.

రూ.50తో మొదలై రూ.10లక్షల దాకా: నేహా, ఆమె సోదరి చౌకీ పాడటం ప్రారంభించినప్పుడు రూ.50 సంపాదించేవారు. నేహా కక్కర్ సంగీత ప్రయాణం 3 లేదా 4 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభమైంది. ఆమె తోబుట్టువులు సోను, టోనీ కక్కర్‌తో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాడేది. ఆమె పాటలు పాడేటప్పుడు ఆమెకు ఎటువంటి అధికారిక సంగీత శిక్షణ లేదు. 16 సంవత్సరాల వయస్సు వరకు ఆమె ఆలయ కార్యక్రమాల్లో ప్రదర్శనను కొనసాగించింది. ఆమె తన కుటుంబానికి ఆర్థికంగా చాలా సాయం చేసింది. 2005లో 'ఇండియన్ ఐడల్' రెండో సీజన్‌లో నేహా కక్కర్ పాల్గొంది. అప్పుడు కూడా షో నుంచి త్వరగానే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత క్రమంగా ఇండియాలోనే పాపులర్ సింగర్​గా ఎదిగింది. అలా ఇప్పుడు ఒక్కో పాటకు రూ.10 లక్షల దాకా ఛార్జ్ చేస్తుందట.

గాయని నేహా కక్కర్: చిన్న గది నుంచి పెద్ద బంగ్లా వరకు

ఈ అతివలు పాటలతోనే కాదు అందంతోనూ పడగొట్టేస్తున్నారుగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.