ETV Bharat / entertainment

10ఏళ్ల పాటు డేటింగ్​ - సీక్రెట్​గా పెళ్లి చేసుకోనున్న ప్రముఖ హీరోయిన్! - Heroine Tapsee Marriage

Heroine Tapsee Marriage : సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ప్రముఖ హీరోయిన్​ తన బాయ్​ఫ్రెండ్​తో పెళ్లి పీటలెక్కబోతుంది. దాని గురించే ఈ కథనం.

10ఏళ్ల పాటు డేటింగ్​ - సీక్రెట్​గా పెళ్లి చేసుకోనున్న ప్రముఖ హీరోయిన్!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 8:39 AM IST

Updated : Feb 28, 2024, 11:46 AM IST

Heroine Tapsee Marriage : సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గ్యాప్ లేకుండా వరుసగా చాలా మంది సినీ సెలబ్రిటీలు బ్యాచిలర్​ లైఫ్​కు గుడ్​బై చెబుతూ పెళ్లి పీటలెక్కేస్తున్నారు. గత పది రోజుల్లోనే దాదాపు ఐదు ఆరు జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందా అంటే అవుననే సమాధానమే చాలా గట్టిగా వినిపిస్తోంది. మొన్నీమధ్యే హీరోయిన్​ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. రీసెంట్​గా కొద్ది రోజుల క్రితమే తెలుగు హీరో ఆశిష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ తాప్సీ కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిందని తెలిసింది. అయితే సీక్రెట్​గా ప్రియుడితో ఏడడుగులు వేయనుందని టాక్ వినిపిస్తోంది.

ఇక్కడ ఫ్లాప్​ - అక్కడ హిట్ :​ తెలుగు చిత్రసీమలో గ్లామరస్ క్యూట్ హీరోయిన్​గా తాప్సీ పేరు తెచ్చుకుంది. 'ఝమ్మంది నాదం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామను సొట్ట బుగ్గల సందరి అని అందరూ పిలిచేవారు. రవితేజ, మంచు మనోజ్, గోపిచంద్​ సహా పలు హీరోలతో నటించింది. కానీ ఆమె తెలుగులో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. తమిళంలోనూ పెద్ద హీరోయిన్​గా పేరు తెచ్చుకోలేదు. ఇక ఎప్పుడైతే బాలీవుడ్​లో అడుగు పెట్టిందో అప్పటినుంచి కూడా వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్​ను అందుకుంది. ముల్క్ , బడ్లా, తప్పడ్ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఎక్కువగా సక్సెస్​ను సాధించింది. రీసెంట్​గా గతేడాది డిసెంబర్​లో షారుక్ ఖాన్​ డంకీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు.

త్వరలోనే పెళ్లి : ఇక తాప్సీ పర్సనల్ విషయానికొస్తే గత పదేళ్ల నుంచి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ మథియస్ బోతో ఆమె రిలేషన్​షిప్​లో ఉంది. అయితే ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడకుండా చాలా కాలం దాచుతూ వచ్చింది. గతేడాదే తమ బంధం గురించి అఫీషియల్​గా ప్రకటించింది. అయితే ఇప్పుడీ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తాజాగా సమాచారం అందింది. ఉదయ్‌పూర్ వీళ్ల పెళ్లికి వేదిక కానుందని తెలిసింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుందని అంటున్నారు.

బిగ్గెస్ట్ మల్టీస్టారర్​కు బాలయ్య జై - ప్రభాస్​తో కలిసి రూ.100కోట్ల బడ్జెట్​ మూవీలో!

OTTలో సూపర్ హిట్​ క్రైమ్ థ్రిల్లర్స్​ - ఇవి చూశారంటే అంతే ఇక​!

Last Updated : Feb 28, 2024, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.