ETV Bharat / entertainment

పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్​! - Heroine Megha Akash Marriage - HEROINE MEGHA AKASH MARRIAGE

Heroine Megha Akash Marriage : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది, తాజాగా మరో భామ కూడా పెళ్లి గురించి హింట్ ఇస్తుంది.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 7:06 PM IST

Heroine Megha Akash Marriage : గత ఏడాది నుంచి వరుసగా హీరోయిన్ల పెళ్లిళ్ల వార్తలు వస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్​, తాప్సీ పన్ను, అదితి రావు హైదరి, అపర్ణ దాస్ పెళ్లి వార్తలు కూడా తాజాగా వినిపించాయి. వరలక్ష్మి శరత్ కుమార్, తమన్నా కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్​కు కూడా కల్యాణ ఘడియలు వచ్చాయని తెలుస్తోంది.

ఎవరంటే? - లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మేఘ ఆకాశ్​ తన సోషల్ మీడియాలో సంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని, తన చేతులకున్న మెహందిను చూపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో మాత్రమే పెళ్లి గురించి అనుమానాలను పెంచలేదు. ఆ ఫోటోకు #weddingvibes అనే హాష్ ట్యాగ్ కూడా ఉపయోగించడమే అందరూ అలా అనుకోవడానికి కారణమైంది. అయితే గత ఏడాది కూడా మేఘ ఆకాశ్​ పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చాయి. మేఘ చెన్నైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ మీడియాలో న్యూస్ వచ్చింది అయితే వాటి గురించి మేఘ కుటుంబం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

ఇప్పుడు కూడా అటువంటి వార్తలా లేక నిజంగానే ఈ అమ్మడు పెళ్లికి సిద్ధం అయిందా అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ఫోటోలు తన నిజమైన పెళ్లివి కావని ఒక యాడ్ షూటింగ్​లో భాగంగా దిగిన ఫోటోలని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంపైన మేఘ మాత్రం ఇంకా స్పందించలేదు.

MEGHA AKASH UPCOMING MOVIES : కాగా, లై, చల్ మోహన రంగ, గుర్తుందా శీతాకాలం, రావణాసుర వంటి సినిమాల్లో నటించిన మేఘకు హీరోయిన్​గా పెద్ద గుర్తింపు రాలేదు. రావణాసురలో చేసిన నెగటివ్ క్యారెక్టర్ కూడా మేఘ కెరీర్​కు పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే మేఘ మనసు పెళ్లి మీదకు మళ్లిందని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా షూటింగ్స్​తో బిజీగా ఉంది.

'మెగాస్టార్​లా ఖాన్​లు ఆ పాత్ర చేయలేరు' - బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్​! - vidya balan

వీకెండ్ స్పెషల్​ - OTTలోకి వచ్చేసిన రూ.200కోట్ల భారీ బ్లాక్ బస్టర్ కాంట్రవర్సీ మూవీ - This week OTT releases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.