ETV Bharat / entertainment

మాజీ ముఖ్యమంత్రి మనవడితో ప్రముఖ హీరోయిన్ డేటింగ్!​ - వీడియో వైరల్ - Manushi Chhillar Boyfriend - MANUSHI CHHILLAR BOYFRIEND

MANUSHI CHILLAR BOYFRIEND : :మాజీ విశ్వ సుందరి మానుషి చిల్లర్, మాజీ సీఎం మనవడితో డేటింగ్‌లో ఉందంటూ మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ఆ మధ్య అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో మానుషి-వీర్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో బయటకు రాగా ఇప్పుడు మరో లీక్డ్​ వీడియోతో ఈ గాసిప్స్​కు మరింత బలం చేకూరింది.

source ANI
Manushi Chhillar (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 1:33 PM IST

MANUSHI CHILLAR BOYFRIEND VEER PAHARIYA : మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్‌ నటి మానుషి చిల్లర్​ - మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు వీర్‌ పహారియాతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఒకరు పోస్ట్ చేసిన వ్లాగ్లో మానుషి, వీర్‌ భుజంపై విలాసంగా తలపెట్టి సేద తీరటం కనిపించింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్రీ - తాను జాన్వీకపూర్‌, ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియా, ఇతర స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు ఒక వ్లాగ్ షేర్ చేశాడు. పోస్ట్ చేసిన వీడియోకు జాన్వీ ఫొటోషూట్‌తో బిజీగా ఉన్నారంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఆ ఫోటో ఘాట్​లో జాన్వీ పక్కన మానుషి, వీర్‌ కలిసి కనిపించారు. వీర్‌ భుజంపై తల పెట్టుకొని మానుషి చిల్లర్ సేదతీరుతూ కనిపించడం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. అంతకుముందు అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుకలో కూడా ఈ జంట కలిసి కనిపించింది. కలిసి చిందులేసి అందర్నీ ఆకట్టుకుంది.

కాగా, హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో విశ్వసుందరిగా విజయం సాధించిన తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్‌కుమార్‌ హీరోగా తన తొలి చిత్రంలో నటించింది. అనంతరం ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడేమియా ఛోటే మియా వంటి సినిమాలు చేసింది. ఆపరేషన్ వాలెంటైన్‌లో నటించి తెలుగువారికి కూడా పరిచయం అయ్యింది.

అయితే బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న మానుషి తన మార్క్ మాత్రం చూపించ లేకపోతోంది. ప్రస్తుతం మానుషి జాన్‌ అబ్రహం హీరోగా నటిస్తున్న టెహ్రాన్ మూవీ కోసం వర్క్‌ చేస్తోంది. ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే మనవడే వీర్‌ పహారియా కూడా నటుడిగా తన లక్ పరీక్షించుకోనున్నాడట. స్కై ఫోర్స్ సినిమాతో తొలిసారి నటుడిగా పరిచయం కానున్నాడు. అతడి సోదరుడు శిఖర్‌ పహారియా వ్యాపారవేత్త. బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌, శిఖర్‌లు ఎంతోకాలం నుంచి స్నేహితులు. వీరిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

గ్రాండ్​గా బాలయ్య 50 ఇయర్స్ సినీ జర్నీ సెలబ్రేషన్స్​ - ఆహ్వాన పత్రిక ఇదే! - NBK 50 years celebrations

'రామ్‌చరణ్‌-ఉపాసన అలాంటోళ్లు' - క్లీంకార కేర్‌ టేకర్‌ లలిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.