Prasanna Vadanam Review;
చిత్రం: ప్రసన్నవదనం;
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు;
సంగీతం: విజయ్ బుల్గానిన్;
సినిమాటోగ్రఫీ: ఎస్.చంద్రశేఖరన్;
ఎడిటింగ్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్;
నిర్మాత: మణికంఠ జేఎస్, ప్రసాద్‌రెడ్డి టీఆర్;
రచన, దర్శకత్వం: అర్జున్ వైకే;
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న హీరో సుహాస్. ఈ మధ్యే ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. కలర్ ఫొటో నుంచి కథానాయకుడిగా మారి పక్కింటి అబ్బాయిని గుర్తు చేసే పాత్రలు చేస్తున్నాడు. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు ప్రసన్న వదనంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
కథేంటంటే : రేడియో జాకీగా పనిచేసే సూర్య (సుహాస్)కు ఒక ప్రమాదం తన జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది. అమ్మానాన్నల్ని కోల్పోతాడు. ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్యకు కూడా గురౌతాడు. ఎవరి మొహాల్నీ, గొంతుల్ని గుర్తు పట్టలేడు. ఈ సమస్య గురించి తన స్నేహితుడు విఘ్నేష్ (వైవా హర్ష)కు తప్ప ఎవరికీ తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటాడు. ఈ క్రమంలోనే ఆద్య (పాయల్)తో ప్రేమలో పడిన అతడు అనుకోకుండా తన కళ్లతో ఓ హత్య చూస్తాడు. కానీ తనకున్న సమస్య వల్ల ఆ హత్య ఎవరు చేశారో తెలుసులేకపోతాడు. కానీ, పోలీసులకు ఈ విషయం చెప్పాలని ప్రయత్నించిన అతడిపై దాడి జరుగుతుంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా సూర్య ముందుకెళ్తాడు. అనూహ్యంగా ఆ హత్య కేసులో తానే ఇరుక్కుని మరిన్ని కష్టాల్ని ఎదుర్కొంటాడు. . మరి ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? హత్యకు గురైన ఆ అమ్మాయి ఎవరు? ఆ కేసులో సూర్య ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది? చివరికి సుహాస్ దీని నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే కథ.
ఎలా ఉందంటే : సుహాస్‌ను ఇందులో కొత్తగా చూపించారు. తన లోకల్ బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సినిమా ఆద్యంతం మంచి మలుపులు తిరుగుతూ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను పంచుతుంది. ఓరకంగా దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. హీరోకు అతడి స్నేహితుడికీ మధ్య సీన్స్, ఆద్యతో లవ్ ట్రాక్ ఎపిసోడ్స్ బాగున్నాయి. హీరో హత్యను చూడటంతో కథ మలుపు తిరిగి ఆసక్తి మొదలవుతుంది.ఇంటర్వెల్ ముందు మలుపు తిరిగిన ఈ కథ సినిమాను ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.
సెకంఢాప్లో హీరో చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం, హీరో తనకున్న వ్యాధితోనే నేరస్థుడు ఎవరనేది కనిపెట్టడానికి చేసే పోరాటం, ఈ క్రమంలోనే చోటు చేసుకునే మలుపులు ఆసక్తికరంగా సాగుతాయి. హత్యకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా కీలకం. క్లైమాక్స్ సీన్స్ సినిమాను మరింత ఉత్కంఠగా చూపిస్తుంది. అక్కడక్కడ మాత్రమే కాస్త స్లో అవుతుంది కానీ ఓ కొత్త రకమైన థ్రిల్లర్‌ను చూసిన అనుభూతి మాత్రం ఉంటుందనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే : సుహాస్ నటన ఎప్పటి లాగే సూపర్. అతడి పాత్ర కామెడీ, ఎమోషనల్ బాగా పండింది. పోలీస్ అధికారిగా రాశిసింగ్ పాత్ర అలరించింది. నితిన్ ప్రసన్న పాత్ర సినిమాకు ఎంతో కీలకం. వైవాహర్ష తెలిసిన స్నేహితుడి పాత్రలో సందడి చేశాడు. నందు, సాయి శ్వేత తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్‌గా ఏ విభాగం లోటు చేయలేదు. చంద్రశేఖరన్ కెమెరా వర్క్ మంచిగా ఉంది. విజయ్ బుల్గానిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రభావం చూపుతుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు అర్జున్ తన తొలి చిత్రాన్నే ఎంతో స్పష్టంగా చూపించారు. తన రచనలో బిగి, బలం దాగి ఉంది. నిర్మాణం పరంగా ఎటువంటి లోటు లేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మాట నిలబెట్టుకున్న రాజమౌళి-మహేశ్ - Rajamouli Mahesh Babu Movie