Double Ismart: స్టార్ హీరో రామ్ పోతినేని- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా కావ్యా థాపర్ నటించింది. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖ పట్టణంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు రామ్, హీరోయిన్ కావ్యా సహా తదితరులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ మాడ్లాడారు.
'డబుల్ ఇస్మార్ట్' కమర్షియల్ సినిమా అని, థియేటర్లలో డబుల్ మాస్ మ్యాడ్‌నెస్‌తో సంబరాలు చేసుకునేలా ఉంటుందని అన్నారు. 'ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ చేసిన సినిమాలన్నింటి కంటే ఎక్కువ టైమ్ తీసుకుని చేసిన చిత్రమిది. కమర్షియల్ సినిమా హిట్టయితే దాంట్లో వచ్చే కిక్కే వేరు. అది 'ఇస్మార్ట్ శంకర్'తో అప్పుడు చూశాను. మళ్లీ 'డబుల్ ఇస్మార్ట్'తో ఆ కిక్ ఉంటుందని ఆశిస్తున్నాను' హీరో రామ్ అన్నారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే, 'తలకి USB పోర్ట్ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక్క ఇడియట్' అంటూ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్‌గా రామ్ పాత్రను ట్రైలర్‌లో ఆసక్తికరంగా పరిచయం చేశారు. దాదాపు రెండున్నర నిమిషాలకు పైగా నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్ యాక్షన్ హంగామానే కనిపించింది. బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ దత్ ఇందులో బిగ్‌బుల్ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన మెదడులోని జ్ఞాపకాల్ని ఇస్మార్ట్ శంకర్ మెదడులోకి ప్రవేశ పెడితే ఏం జరిగిందన్నద జానర్లో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఇక హీరోయిన్ కావ్యకు రామ్‌కు మధ్య నడిచే లవ్‌ట్రాక్ వాళ్లిద్దరి కెమిస్ట్రీ అలరించింది. కమెడియన్ అలీ గెటప్‌లో కూడా పూరి మార్క్ కనిపించింది.
కాగా, ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. పూరి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నటి చార్మి సినిమాను నిర్మించారు. ఛాయాగ్రహణం బాధ్యతలు సామ్ కె.నాయుడు, జియాని జియాన్నెలి చూసుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.