ETV Bharat / entertainment

ముంబయి, కేరళలో విలాసవంతమైన బంగ్లాలు, బోలెడన్నీ లగ్జరీ కార్లు! - పృథ్వీరాజ్​ సుకుమారన్​ లైఫ్​స్టైల్ - HAPPY BIRTHDAY PRITHVIRAJ SUKUMARAN

సలార్‌ ప్రభాస్ ఫ్రెండ్ పృథ్వీ సుకుమారన్ లగ్జరీ లైఫ్ స్టైల్​, కార్ కలెక్షన్స్​, నెట్​ వర్త్ డీటెయిల్స్​!

Prithviraj Sukumar Luxury Life Net Worth
Prithviraj Sukumar Luxury Life Net Worth (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 12:37 PM IST

Prithviraj Sukumar Luxury Life Net Worth : సలార్‌లో ప్రభాస్ ఫ్రెండ్‌గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కేవలం నటుడే కాదు మలయాళంలో స్టార్ డైరక్టర్ ప్రొడ్యూసర్ కూడా. అక్టోబరు 16న పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన నేడు 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గత 22 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న ఆయన ఇప్పటికే మళయాలం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్ర వరద రాజమన్నార్‌గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులలోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అనిపించుకున్న ఆయన 'ఆడు జీవితం, ద గోట్ లైఫ్' సినిమాతో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించారు. కథకు తగ్గట్లుగా స్క్రీన్‌పైన పాత్రలో ఒదిగిపోతూ మంచి పెర్‌ఫార్మెన్స్ కనబరిచే ఆయన లైఫ్​ స్టైల్​, నెట్​ వర్త్, పర్సనల్ లైఫ్​ స్టైల్​​ వంటి విషయాలను తెలుసుకుందాం.

సినిమాల్లోకి అలా - పృథ్వీరాజ్‌ది సినీ బ్యాక్​గ్రౌండ్ ఫ్యామిలీ. తండ్రి పరమేశ్వరన్‌ సుకుమారన్‌, తల్లి మల్లిక, అన్నయ్య ఇంద్రజిత్‌, వదిన పూర్ణిమ అందరూ నటులే. అయితే పృథ్వీ చిత్ర పరిశ్రమలో కాకుండా మరో రంగంలో స్థిరపడాలనుకున్నారు. ఉన్నత చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. అయితే అక్కడ ఉన్నప్పుడు దర్శకుడు రంజిత్‌ నుంచి ఓ సినిమాకి సంబంధించి ఆడిషన్​కు పిలిపించి హీరోగా సెలెక్ట్ చేశారు. అలా తొలిసారి నందనం సినిమాలో కనిపించిన ఆయన ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించారు.

ప్రేమ పెళ్లి - సుకుమారన్ భార్య పేరు సుప్రియా మేనన్‌. ఈమె గతంలో జర్నలిస్టు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. తన భార్య వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెబుతుంటారు పృథ్వీ. వీరికో పాప. పేరు అలంకృతా మేనన్‌ సుకుమారన్‌.

ఓ ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సుమారుగా రూ.54కోట్ల వరకూ ఆస్తులున్నట్లు సమాచారం. భారీ పారితోషికం అందుకునే అతికొద్ది మంది మళయాలీ నటుల్లో ఒకరైన సుకుమారన్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారట. సలార్​లో ప్రభాస్ స్నేహితుడి పాత్ర కోసం సుకుమారన్ రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

అంతేకాదు, మోహన్ లాల్ నటించిన 'లూసిఫర్' సినిమా కోసం డైరక్టర్‌గా కూడా మారారు. సుకుమారన్, అతని భార్య సుప్రియ మేనన్ ఇద్దరూ కలిసి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పేరిట 2018లో ఒక బ్యానర్ కూడా స్థాపించారు. ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చినవే హిట్ సినిమాలు డ్రైవింగ్ లైసెన్స్, కడ్వా. వీటితో పాటుగా కల్యాణ్ సిల్క్, అస్సెట్ హోమ్స్ లాంటి ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు కూడా బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌గా వ్యవహరిస్తున్నారు పృథ్వీ.

కార్ కలెక్షన్స్​ - సినిమాలతో నిత్యం బిజీగా ఉండే సుకుమారన్​ కేరళ కొచ్చిలోని ఓ విలాసవంతమైన బంగ్లాలో ఉంటారు. దీంతోపాటుగా ముంబయిలో ఉండేందుకు బాంద్రాలోని పాలి హిల్​లో రూ.17 కోట్లు వెచ్చించి ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారట. ఇవే కాదు ఆయన ఆటోమొబైల్ కలెక్షన్ కూడా గ్రాండ్ గానే ఉంది. లగ్జరీ కార్లు అయిన లాంబోర్గినీ యురస్ (రూ.4.18 కోట్లు - రూ.4.22 కోట్లు), మెర్సిడెస్-ఏఎంజీ జీ 63 (రూ.2.45 కోట్లు - రూ.3.30 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ (రూ.2.45 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 (రూ.93.55 లక్షలు - రూ.2.30 కోట్లు), పోర్షే కేన్నే (రూ.1.63 కోట్లు - 1.96 కోట్లు)లు సుకుమారన్ గ్యారేజిలో ఉన్నాయి.

'అఖండ 2' టైటిల్ థీమ్ కూడా వచ్చేసింది - తమన్ తాండవం అదిరిపోయిందంతే!

ట్రెండింగ్​లో సమంత 'సిటాడెల్'​ - ఈ సిరీస్​ కోసం ఆమె ఎన్ని కోట్లు తీసుకుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.