ETV Bharat / entertainment

ఓటీటీలో వచ్చేసినా థియేటర్లలో తగ్గని హనుమాన్ క్రేజ్​ - 25 సెంటర్లలో 100 రోజులుగా! - Hanuman 100 Days - HANUMAN 100 DAYS

Hanuman 100 Days Celebrations : హనుమాన్ సినిమా థియేటర్లలో విడుదలై 100 రోజులు పూర్తి చేసుకుంది. ఓటీటీలో రిలీజైనప్పటికీ ఇంకా క్రేజ్ తగ్గకుండా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 3:29 PM IST

Hanuman 100 Days Celebrations : సూపర్ హీరో సినిమా హను-మాన్ ఈ సంక్రాంతికి థియేటర్లలో వచ్చి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఈ విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలై సుమారు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ వంటి చిత్రాలతో తీవ్రమైన పోటీలోనూ విజేతగా నిలిచింది. అయితే ఈ చిత్రం నేటితో (ఏప్రిల్ 22) వంద రోజుల మైలురాయిని పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా మూవీటీమ్ ఈ విషయాన్ని తెలుపుతూ చరిత్రాత్మక 100 రోజులు అంటూ ఓ పోస్టర్​ను రిలీజ్ చేసింది. ప్రేక్షకుల మనసులో ఈ చిత్రం నిలిచిపోయిందని అని రాసుకొచ్చింది. అలాగే 25 సెంటర్లలో 100 రోజుల సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు వెల్లడించింది. "హిస్టారికల్ బ్లాక్‍బస్టర్ హనుమాన్ చిత్రం 100 రోజులను 25 సెంటర్లలో సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఇది ఓ అరుదైన ఘనత. ప్రేక్షకుల మనసుల్లో చోటును దక్కించుకొని హనుమాన్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది" అని క్యాప్షన్​లో రాసుకొచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా ఓటీటీల్లోకి వచ్చినా - ఓటీటీలో రిలీజైన కూడా ఇంకా మరి కొన్ని థియేటర్లలో ఈ చిత్రం నడుస్తుండటం విశేషమనే చెప్పాలి. ఈ మూవీ(Hanuman Movie OTT) తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా హిందీ వెర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

ఈ హనుమాన్ సినిమాలో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్ కూడా నటించింది. హీరోయిన్​ పాత్రలో కనువిందు చేసింది. వినయ్ రాయ్ స్టైలిష్​ విలన్​గా, వెన్నెల కిశోర్ సైంటిస్ట్​గా, వరలక్ష్మి శరత్ కుమార్ హీరో అక్కగా, విభీషణుడిగా సముద్రఖని, కామెడీ రోల్​లో గెటప్ శీను కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్​పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. గౌరహరి, అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

తగ్గిన టాలీవుడ్ బాక్సాఫీస్ జోరు - ఈ వారం థియేటర్​, OTTలో రాబోతున్న సినిమాలివే! - THIS WEEK MOVIE RELEASEs

'మంజుమ్మెల్ బాయ్స్' OTT డీల్స్ కంప్లీట్- స్ట్రీమింగ్ ఎక్కడంటే? - MANJUMMEL BOYS OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.