GV Prakash Dasara Movie: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కెరీర్లో 'దసరా' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నాని రూ.100కోట్లు క్లబ్లో ఎంటర్ అయ్యారు. నానితోపాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నాని ఫ్రెండ్‌గా నటించిన దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ముందుగా యంగ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ను సంప్రదించారట. ఈ విషయాన్ని జీవీ ప్రకాశ్ 'డియర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు.
'దసరా సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం దర్శకుడు శ్రీకాంత్ నన్నే అప్రోచ్ అయ్యారు. కానీ, డేట్స్ సమస్య కారణంగా ఆ సినిమా చేయలేకపోయాను. అయితే త్వరలోనే తెలుగులో సినిమా చేస్తాను. ఇక డియర్ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. తెలుగులో వాయిస్ అందించిన నాగచైతన్యకు స్పెషల్ థాంక్స్' అని జీవీ ప్రకాశ్ అన్నారు. ఇక ఈ సినిమాలో జీవీ ప్రకాశ్‌కు జంటగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ నటించింది. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా, ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించారు. తన భార్య గురక వల్ల ఒక అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో సినిమాను తెరెకెక్కించారు.
ఇది గుడ్‌నైట్ ఫీమేల్ వెర్షనా?
ఈ సినిమా రిలీజ్లో భాగంగా మూవీటీమ్ ప్రెస్మీట్లో పాల్గొంది. ఈ మీట్లో హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సినిమా 'గుడ్‌నైట్' ఫీమేల్ వెర్షన్‌లా ఉంది? అన్న విలేకరి ప్రశ్నకు ఐశ్వర్య జవాబిచ్చింది. 'మీరే కాదు చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. గుడ్‌నైట్ స్టోరీకి మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. రెండింట్లో గురక కామన్ పాయింట్. అందుకే అందరు అలా అనుకుంటున్నారు. మా డైరెక్టర్ ఈ స్టోరీని నాలుగేళ్ల కిందటే రాశారు. గుడ్‌నైట్ టైటిల్ మాదే. కాకపోతే వాళ్లు అడిగారని మేమే వాళ్లకు ఇచ్చేశాం' అని చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓటీటీలో 'దసరా'.. 'ప్రియాంక సిటాడెల్' రిలీజ్ ఆ రోజే..
'నాని- సుజిత్' కాంబో ఫిక్స్- క్రేజీ వీడియో ఔట్- రిలీజ్ ఎప్పుడంటే?