Gilli Movie Re Release Collections : రీ రిలీజ్‌ల ట్రెండ్ వల్ల అటు సెలబ్రిటీలతో పాటు ఇటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తమ ఫేవరట్ స్టార్ బర్త్‌డే లేకుంటే, ఏదైనా స్పెషల్ అకేషన్ రోజు ఆయా మూవీస్‌ను విడుదల చేయమంటూ నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తుండటం వల్ల ఈ ట్రెండ్‌కు మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఇక అభిమానుల కోరిక మేరకు ప్రొడ్యూసర్లు కూడా కొన్ని పాత సినిమాలను 4kలో రెండర్ చేసి మరీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాలు అటు వినోదాన్ని పంచడమే కాకుండా ఇటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
అయితే ఈ ట్రెండ్‌లో బడా నుంచి యంగ్ స్టార్స్ అందరూ తమ సినిమాలతో సందడి చేయగా, ఒక్క హీరో మాత్రం అత్యంత కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్. ఇప్పటి వరకు ఇండియాలో రీ-రిలీజ్ ద్వారా భారీ వసూళ్లు సాధించిన హీరో విజయ్ కావడం విశేషం.
ఇటీవలే విజయ్ నటించిన 'గిల్లీ' మూవీ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ- రిలీజ్ అయింది. అప్పట్లో సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్లోనూ దాదాపు రూ. 23 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు త్వరలో భారతీయుడు 1 సినిమా రీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మొదటి పార్ట్ రిలీజ్ చేయడం కూడా ఓ అడ్వాంటేజ్ అని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి పార్ట్ నుంచి అభిమానులు ఈ రెండో మూవీకి మరింత అంచనాలు పెరుగుతాయని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
దళపతి ఫ్యాన్స్ దెబ్బకు అకౌంట్ క్లోజ్ చేసిన సంగీత దర్శకుడు! - Thalapathy Vijay Whistle Podu Song