ETV Bharat / entertainment

'గర్ల్ ఫ్రెండ్స్​తో అలా చేసేవాళ్లం' - తమ్ముడి సీక్రెట్స్ చెప్పేసిన విజయ్ దేవరకొండ! - Gam Gam Ganesha Movie - GAM GAM GANESHA MOVIE

Gam Gam Ganesha Movie : గం గం గణేశా ట్రైలర్ నచ్చిందని, చాలా ఫన్​గా అనిపించిందని చెప్పిన విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి కొన్ని సీక్రెట్స్​ను బయటపెట్టారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Gam Gam Ganesha Movie
Gam Gam Ganesha Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 5:36 PM IST

Gam Gam Ganesha Movie : విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండ ప్రతి సినిమాకి స్టోరీ ఎంపికలో వైవిధ్యం కనబరుస్తున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, దొరసాని, బేబీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో విజయ్‌తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేసిన వాళ్లే బేబీ సినిమా తర్వాత ఆనంద్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు చాలామంది విజయ్​ -ఆనంద్​ యాక్టింగ్, వాయీస్ దగ్గర దగ్గరగా ఒకేలా అనిపిస్తుందని అంటున్నారు. ఇదే మాట విజయ్​ను అడిగితే అవునని చెబుతూనే తన తమ్ముడి గురించి కొన్ని ఫన్నీ సీక్రెట్స్​ బయటపెట్టారు. 'గం గం గణేశా' సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ఫోన్​లో ఈ విషయాన్ని చెప్పారు.

"ఔను ఇద్దరి వాయీస్ దాదాపు సేమ్​గా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మని పిలిస్తే, నేను పిలిచానో తమ్ముడు పిలిచాడో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేది. అప్పుడే అర్థమైంది వాయీస్ గురించి. అప్పటి నుంచి మా వాయీస్ చాలా రకాలుగా వాడాం. నా ఫోన్ తీసుకుని ఫ్రెండ్స్‌ను, గర్ల్ ఫ్రెండ్స్‌ను ఆనంద్ ప్రాంక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నా వాట్సప్‌లో వాయీస్ నోట్‌లు, ఫోన్ కాల్స్ ఇలా అన్నింటినీ కవర్ చేసేసేవాడు. ఒకసారి నా సినిమా డబ్బింగ్​కు కూడా వాడినే పంపిద్దామని అనుకున్నా" అని సరదాగా అన్నారు విజయ్.

ఇంకా గం గం గణేశా ట్రైలర్ గురించి మాట్లాడుతూ చాలా నచ్చిందని, చాలా ఫన్​గా అనిపించిందని చెప్పారు విజయ్ దేవరకొండ. కన్ఫ్యూజన్, కామెడీలను పండించిన ఆనంద్ పెర్పార్మెన్స్ చూసి హ్యాపీగా ఫీలయ్యానని అన్నారు.

కాగా, ఆనంద్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించగా, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్​ ప్రేక్షుకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని హై లైఫ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టిలు నిర్మిస్తున్నారు. మే 31న వరల్డ్ వైడ్​గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.

ప్రశాంత్​ వర్మ, రణ్​వీర్ సింగ్​ సినిమా - ఆ రూమర్స్​లో నిజం లేదు - Ranveer Singh Prasanth Varma Movie

'హరోం హర' రిలీజ్ పోస్ట్​పోన్​ - సుధీర్​కు కలిసొచ్చే నెలలో రిలీజ్ - Harom Hara Movie Release Date

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.