Gaami Movie Trailer: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్- చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా గామి. ఈ సినిమాను దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్, గురువారం ట్రైలర్ విడుదల చేశారు. 3 నిమిషాల 43 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను విఎఫ్ఎక్స్తో గ్రాండ్‌గా డిజైన్ చేశారు మేకర్స్.
హీరో విశ్వక్సేన్ ఈ మూవీలో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకు ఎప్పుడూ చేయలేని అఘోర క్యారెక్టర్లో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఇక హిమాలయాల్లో కూర్చొని మంట కాచుకుంటున్న హీరో సీన్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో, ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు' అనే డైలాగ్‌తో హీరో వాయిస్ వినిపిస్తుంది.
అయితే హీరోకు ఏదో వ్యాధి ఉన్న వ్యక్తిగా చూపించారు. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలి పత్రాలు ఈ వ్యాధికి విరుగుడు అని ఓ అఘోరా హీరోకు చెబుతాడు. ఇక త్వరలో వికసించే ఆ పత్రాల కోసం హీరో హిమాలయాలకు పయనమవుతాడు. అయితే ఈ మూవీలో హీరో కథతోపాటు ఈ సినిమాలో హీరోయిన్ స్టోరీ, విలేజ్ బ్యాట్గ్రౌండ్ స్టోరీ కూడా ఉన్నాయి. ఆధ్యంతం ఆసక్తిగా సాగిన ట్రైలర్లో బీజీఎమ్ ఓ హైలైట్. హీరో హిమాలయా ప్రయాణం, హీరోయిన్ స్టోరీ ఇవన్నీ తెలియాలంటే మర్చి 8న థియేటర్లలో సినిమా చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Gaami Movie Cast: దర్శకుడు విద్యాధర్ కాగిత ఈ సినిమాను సుమారు నాలుగేళ్లపాటు శ్రమించి ప్రతిష్ఠాత్మకంగా సినిమా తెరకెక్కించారు. అయితే ట్రైలర్ ఔట్పుట్ చూసిన తర్వాత ఆలస్యమైనా మంచి నిర్మాణ విలువలతో రూపొందించారని అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వక్సేన్ నటనతో అదరగొట్టారు. ఇక ఈ సినిమాను సెల్యూలాయిడ్, తమడామీడియా బ్యానర్స్‌పై కార్తీక్ నిర్మించారు. నరేశ్ కుమరాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మహ్మద్ సమద్, శాంతి రావు, దయానంద్, అభినయ, హారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మైనస్ 40 డిగ్రీల చలిలో షూటింగ్ - విశ్వక్‌ను చూసి వాళ్లు అలా చేశారట