First Day Zero Tickets Sold Movie : బాక్సాఫీసుకు మంచి కలెక్షన్లు వస్తేనే సినీ పరిశ్రమ మరింత ముందుకెళ్తుంది. మంచి లాభాలే మరిన్ని మంచి సినిమాలకు కావలసిన నమ్మకాన్ని, బలాన్ని చేకూరుస్తాయి. అలా అని విడుదల అవగానే అన్ని సినిమాలు హిట్ అవ్వలేవు కదా. కొన్ని సార్లు ఫ్లాప్‌లు ఇండస్ట్రీలో సాధారణమే. అయితే కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో లాభాలు తెస్తే కొన్ని మాత్రం తొలుత యావరేజ్ టాక్ అందుకుని సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోతాయి. చాలా మంది నటీనటుల భవిష్యత్తునే మార్చేస్తాయి. 2000లో సరిగ్గా ఇదే జరిగింది. ఓపెనింగ్ డే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోని ఈ సినిమా ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ అందుకుని హీరో కెరీర్‌ను కూడా నిలబెట్టింది.
ప్రముఖ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించిన 'హేరా ఫేరీ' చిత్రం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఆశ్చర్యంగా అనిపిస్తుందా. అవును బాలీవుడ్ ఫేమస్ స్టార్లు అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేశ్ రావల్‌లు నటించిన ఈ చిత్రానికి మొదట్లో ఎలాంటి ఆదరణ లభించలేదట. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి ఈ సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు.
"హేరా ఫేరీ విడుదలైన తర్వాత మొదటి రెండు షోలు పూర్తిగా జీరో టికెట్లతో ఉంది. పైగా డిజాస్టర్ టాక్ కూడా తెచ్చుకుంది. కానీ అదృష్టవశాత్తూ అదే రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కాస్త ఊపందుకుంది. తరువాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారతదేశంలో రూ.12కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.21కోట్లు సంపాదించింది." అని సునీల్ శెట్టి అన్నారు.
2000లో విడుదలైన 'హేరా ఫేరీ' బాలీవుడ్ చరిత్రలోనే సక్సెస్ఫుల్ కామెడీ చిత్రంగా నిలిచింది. కేవలం రూ.6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.21కోట్లు వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2006లో విడుదలైన 'ఫిర్ ఆయా హేరా ఫేరీ' కూడా మంచి ఆదరణ పొందంది. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రం రూ.70 కోట్లు సంపాదించింది.
అక్షయ్ కుమార్ కెరీర్‌ను ఎలా మార్చిందంటే
90వ దశకంలో బాలీవుడ్‌లోని సక్సెస్ఫుల్ యాక్షన్ స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకరు. కానీ ఆ దశాబ్దం చివర్లో వరుస ఫ్లాప్‌లను చవిచూశారు. 'ఖిలాడీ', 'సంఘర్ష్' వంటి బిగ్గెట్ ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న అక్షయ్‌కి 'జాన్వర్' చిత్రం కొంత ఊరటనివ్వగా, 'హేరా ఫేరీ' ఆయన్ను తిరగి సక్సెస్ఫుల్ స్టార్‌ను చేసింది. ఇందులో అక్షయ్ కామెడీ యాంగిల్ అందరి మెప్పు పొందింది.
ఇక అక్షయ్ ఆ తర్వాత 'ముఝ్సే షాదీ కరోగీ', 'గరం మసాలా', 'ఆవారా పాగల్ దీవానా', 'భాగం భాగ్' వంటి సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత 2007 నుంచి 2019 వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల్లో ఒకరిగా అక్షయ్‌ను నిలిపింది.
10 వేల మందితో క్లైమాక్స్ సీన్ షూట్ - ఈ సూపర్ హిట్ మూవీ చూశారా? - Movie Climax Scene 10000 Artists
ఆ ఒక్క సీన్‌ను మూడేళ్ల పాటు షూట్ చేశారట! - ఏ సినిమా కోసం అంటే? - Amitabh Bachchan Sholay Movie