ETV Bharat / entertainment

హృతిక్ మూవీస్​లో హైయ్యెస్ట్ గ్రాసర్​ - 'ఫైటర్​' బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే ? - ఫైటర్ మూవీ డే 3 కలెక్షన్స్

Fighter Box Office Collection : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డైరెక్టర్ సిద్ధార్థ్​ ఆనంద్​ కాంబోలో వచ్చిన 'ఫైటర్' మూవీ ప్రస్తుతం పాజిటివ్​ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే ?

Fighter Box Office Collection
Fighter Box Office Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 2:07 PM IST

Fighter Box Office Collection : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకుణె కాంబోలో విడుదలైన లేటెస్ట్​ మూవీ 'ఫైటర్​'. ఏరియల్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ సిద్ధార్థ్​ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలోకి వచ్చింది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ఫుల్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ద్వారా హృతిక్​ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లో దాదాపు రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ నేపథ్యంలో హృతిక్ ఇతర సినిమాలైన 'అగ్నిపథ్', 'కాబిల్' తర్వాత రిపబ్లిక్ డే సమయంలో విడుదలై రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హ్యాట్రిక్ మూవీగా 'ఫైటర్' చరిత్రకెక్కింది. ఇలా హృతిక్ సినీ కెరీర్​లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

హృతిక్ కెరీర్​లో హైయ్యెస్ట్ గ్రాసర్స్​ ఇవే : మరోవైపు హృతిక్ కెరీర్​లో రూ.100 కోట్ల క్లబ్​లో చేరిన పదో సినిమాగా 'ఫైటర్' మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2001లో వచ్చిన 'కబీ ఖుషి కబీ గమ్' సినిమా హృతిక్ కెరీర్​​లో తొలి రూ.100 కోట్ల గ్రాసర్​ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 'వార్' - (రూ.442.50 కోట్లు), 'బ్యాంగ్ బ్యాంగ్' - (రూ. 270.75 కోట్లు), 'క్రిష్ 3' - (రూ.291.50 కోట్లు), 'క్రిష్'(రూ. 126.50 కోట్లు), 'మోహంజుదారో' -(రూ. 104 కోట్లు),'విక్రమ్ వేద' - (రూ. 137 కోట్లు) 'ధూమ్ 2' - (రూ.151.50 కోట్లు), 'జోధా అక్బర్' - (రూ. 107.75 కోట్లు), 'జిందగీ నా మిలేగి దోబరా' - (రూ.153.25 కోట్లు), 'అగ్నిపథ్' - (రూ.194.25 కోట్లు), 'కాబిల్' -(రూ.154.50 కోట్లు), 'సూపర్ 30' - (రూ. 205.25 కోట్లు) ఇలా దాదాపు 13 సినిమాలు హృతిక్​ కెరీర్​లో హైయ్యెస్ట్​ గ్రాసర్స్​గా నిలిచాయి.

గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న 'ఫైటర్‌' ట్రైలర్‌ - గాల్లో యాక్షన్‌ సీన్స్ అదిరింది

'టాప్​గన్ : మెవరిక్​' రేంజ్​లో 'ఫైటర్​' టీజర్- యాక్షన్​ మోడ్​లో హృతిక్, దీపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.