Femina Miss Tripura 2017 Death : అందాల సుందరి రింకీ చక్మా క్యాన్సర్‌తో కన్నుమూశారు. రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతోన్న రింకీ మృత్యువుతో పోరాడి ఇటీవలే ఓడిపోయారు. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు. మిస్ బ్యూటీ విత్ పర్పస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడిన ఈమె, అప్పటి నుంచి ఈ వ్యాథికి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అయితే క్యాన్సర్ కాస్త ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. దీంతో అప్పటి నుంచి చికిత్స అందుకుంటున్న రింకీ, ట్రీట్‌మెంట్ అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా. ఫిబ్రవరి 22న ఒక్కసారి ఆరోగ్యం క్షీణించడం వల్ల కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స తీసుకుంటున్న సమయంలో తుదిశ్వాస విడిచారు.
ఆమె స్నేహితులతో పాటు అందాల పోటీ సహచరులు ఇలా పలువురు సన్నిహితులు ఆమె చికిత్స కోసం నిధులను సేకరించారు. ఎప్పుడూ తన అనారోగ్యం గురించి రింకీ బయటపెట్టలేదు. అయితే కొద్దివారాల క్రితం ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టి, ఆర్థిక సహాయం కోరారు.చివరకు కొద్దిగంటల క్రితం వరకు మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మిస్‌ఇండియా ఆర్గనైజేషన్ ధ్రువీకరించింది. రింకీ మృతి పట్ల ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను వైరల్ చేస్తున్నారు.
సినిమాటోగ్రఫర్ సతీమణి కన్నుమూత
Cinematographer Senthil Kumar Wife : 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరపై చూపించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి, యోగా టీచర్ రూహి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.