ETV Bharat / entertainment

'తనే నా ఆరాధ్య దేవత' - సీక్రెట్ ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ! - Family Star Vijay Devarkonda - FAMILY STAR VIJAY DEVARKONDA

FAMILY STAR VIJAY DEVARKONDA : ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్​లో భాగంగా రీసెంట్​గా తాను రిలేషన్​షిప్​లో ఉన్నట్లు చెప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు తన ఆరాధ్య దేవత ఎవతో తెలిపారు. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 6:56 AM IST

FAMILY STAR VIJAY DEVARKONDA : త్వరలోనే ఫ్యామిలీ స్టార్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో జోరుగా పాల్గొంటున్న విజయ్​ ఇప్పటివరకూ తనతో కలిసి నటించిన హీరోయిన్ల గురించి పలు విషయాలను పంచుకున్నారు. వారితో నటించడం ఎలా అనిపించింది? ఎలాంటి అనుబంధం ఏర్పడింది? వంటి విషయాలను చెప్పారు.

నన్ను ఓ హీరోగా నిలబెట్టిన అర్జున్‌రెడ్డిలో నా లవర్‌గా నటించిన షాలినీ పాండేకూ, నాకూ పరిచయం లేదు. షాలినీ చాలా సులువుగా డైరెక్టర్​ చెప్పింది విని, సీన్స్​ను అర్థం చేసుకుని నటించేది. అయితే సినిమా రిలీజయ్యాక చాలామంది మేమిద్దరం నిజంగానే లవర్స్ అని భ్రమపడ్డారు. షాలినీకి అస్సలు తెలుగు రాదు. అయినా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవడం చూసి ఆశ్చర్యపోయాను.

రీతూవర్మతో కలిసి రెండుసార్లు నటించాను. మొదటిసారి ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత పెళ్లిచూపులులో నటించాను. రీతు వర్మ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. దీంతో షూటింగ్‌ సమయంలో ఒకరితో ఒకరం ముందే మాట్లాడుకుని డైలాగుల్ని బాగా ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. మా సీన్లు అయిపోయాక పక్కకు వెళ్లి కూర్చోకుండా తర్వాత ఏం చేయాలీ, ఎలా నటించాలీ కూడా చర్చించుకునేవాళ్లం. అలా తనతో షూటింగ్‌ బాగా కంఫర్ట్​గా ఉంటుంది.

తను నా ఆరాధ్య కాలేజీ డేస్​లో ఏ మాయ చేశావె సినిమా చూసి తనను ఆరాధించడం ప్రారంభించాను. ఆమె నటించే సినిమాలను చూస్తూ చూస్తూ తనపైన క్రష్‌ మొదలైంది. ఆ తర్వాత మహానటి కోసం కలిసి నటించాం. అప్పుడే తన గొప్ప వ్యక్తిత్వం తెలిసి మరింత అభిమానం పెరిగింది. ఆమె ఓ ఫైటర్‌.

నేనూ రష్మిక కలిసి గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ నటిించాం. గీత గోవిందంలో రష్మిక తన పాత్రకు న్యాయం చేసేందుకు వంద శాతం కష్టపడింది. డియర్‌ కామ్రేడ్‌ లిల్లీ పాత్ర కోసం ప్రాణం పెట్టి మరీ నటించింది. ఆ సమయంలో విమర్శలను ఎదుర్కోంది. ఆమె ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. తను చాలా కష్టపడే వ్యక్తి.

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో నేను నలుగురు హీరోయిన్లతో కలిసి నటించాను. అయితే అందులో ఐశ్వర్య రాజేశ్‌తో నటించిన సీన్స్ నచ్చుతాయి. ఆ చిత్రంలో ప్రత్యేకమైన యాసలో మాట్లాడటం కోసం తను చాలా కష్టపడి మరీ ఆ పదాలన్నింటినీ అర్థం చేసుకుని సంభాషణలను చెప్పింది అని విజయ్ అన్నారు.

'రిలేషన్​షిప్​లో ఉన్నా' - నిజాన్ని ఒప్పుకున్న విజయ్ దేవరకొండ! - Vijay Devarkonda Relationship

టిల్లు స్క్వేర్ మ్యాజిక్​​ - అనుపమ పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీరే! - Tillu Square

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.