Fahadh Faasil New Movie : సౌత్ ఇండస్ట్రీలో మిగతా చిత్ర సీమలతో పోలిస్తే మలయాళ సినిమాలకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఎంతో నేచురాలిటీగా రూపొందే ఆ సినిమాలకు చాలా మంది ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతుంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా మాలీవుడ్ నుంచి మరో ఫీల్ గుడ్ మూవీ థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్‌ను అందుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించే మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన ట్రైలర్ ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి ఆదరణ దక్కడం వల్ల గ్రాండ్‌గానే రిలీజ్ చేశారు మేకర్స్. వాలంటైన్ డే కానుకగా థియేటర్లలో రిలీజైంది. మలయాళంలో 250 స్క్రీన్లలో రిలీజ్ చేయగా ప్రధాన నగరాల్లో 50 స్క్రీన్లలో విడుదల చేశారు.
ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. రోజు రోజుకు చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. త్రిస్సూర్, చెన్నై, బెంగళూరు, కొచి, కొట్టాయం, కొల్లాం, హైదరాబాద్‌లో 75 శాతం కన్నా అధికంగా ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.
కేరళలోని ఇతర ప్రధాన నగరాల్లో 60 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అంటే ఈ చిత్రం మూడో రోజే బ్రేక్ ఈవెన్‌ను అందుకుందన్నమాట. ఈ రెస్పాన్స్ మరింత పెరిగితే మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Premalu Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - 'పుష్ప' సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన షెకావత్ సింగ్(మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్) ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. యువ హీరో, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులతో ఈ లవ్ స్టోరీని అతి తక్కువ బడ్జెట్లో రూపొందించారు. హైదరాబాద్, తెలుగు, మలయాళ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిందీ చిత్రం.
రెమ్యునరేషన్లతో పాటు ఇతర ఖర్చులు కలిపి రూ. 4 కోట్ల బడ్జెట్ అయిందట. ఈ చిత్రంలో మమితా, నస్లేన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీమ్, అఖిల భార్గవన్ నటించారు. భావన స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ మూవీని గిరీష్ ఏడీ తెరకెక్కించారు .
OTTలో మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ సినిమా - 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి!