Double Ismart Movie : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో హిట్ సాధించిన 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. దీంతో రామ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇప్పుడీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి నెటిజన్లను సర్ప్రైజ్ చేసింది.
ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజయ్యింది. ఇక తెలుగే కాకుండా తమిళం, మలయాళం అలాగే కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం ప్రేక్షకుల కోసం ప్రస్తుతం స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో రామ్‌తో పాటు కావ్య థాపర్, సంజయ్ దత్, శాయాజీ శిండే, ప్రగతి, గెటప్ శ్రీను, ఉత్తేజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు.
స్టోరీ ఏంటంటే :
బిగ్ బుల్ (సంజయ్ దత్) విదేశాల్లో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. భారతదేశాన్ని ముక్కలు చేయాలన్నదే అతడి కల. దీంతో బిగ్ బుల్ కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' తీవ్రంగా వేట కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఇంతలోనే బిగ్‌బుల్ మెదడులో ఓ కణితి ఉందని, దాని ప్రభావం వల్ల అతడు కొన్ని నెలల వరకు మాత్రమే బతికే అవకాశం ఉందంటూ వైద్యులు చెప్తారు.
ఇది విని షాకైన బిగ్ బుల్ తాను చనిపోకూడదని, ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. అందుకు మార్గాల్ని అన్వేషిస్తున్న సమయంలోనే మెదడులో చిప్ పెట్టుకుని హైదరాబాద్‌లో జీవిస్తున్న ఒకే ఒక్కడు ఇస్మార్ట్ శంకర్ (రామ్) పేరు అతడి కంట పడుతుంది. దీంతో బిగ్ బుల్ మెమొరీస్ అన్నీ కాపీ చేసి, దాన్ని ఇస్మార్ట్ శంకర్ మెదడులో ఉన్న చిప్‌లో పేస్ట్ చేస్తారు. దీని ప్రకారం శరీరం ఇస్మార్ట్ శంకర్‌ది అయినా కూడా ఆలోచనలన్నీ బిగ్ బుల్‌వే కాబట్టి అతడికి మరణం ఉండదనేది వాళ్ల ప్లాన్. మరి ఇస్మార్ట్ శంకర్‌లోకి బిగ్ బుల్ ఆలోచనలు వచ్చాక అసలు ఏం జరిగింది? ఇస్మార్ట్ ఎటువంటి లక్ష్యంతో ఉంటాడు? అతని సొంత జ్ఞాపకాలు, అతని ప్రేమ, లక్ష్యాలన్నీ ఏమయ్యాయి? అన్నదే మిగతా స్టోరీ.
'ఇస్మార్ట్' బాయ్ రామ్ పోతినేని గురించి ఈ 13 విషయాలు తెలుసా? - Ram Potineni Favourites
రివ్యూ: రామ్, పూరి ఖాతాలో హిట్ పడిందా?- డబుల్ సిమ్ కార్డ్ ఎలా పని చేసిందంటే? - Double Ismart Review