DJ Tillu Square : టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ ముందు ఊహించిన దానికన్నా భారీగానే డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో మూవీటీమ్ అంతా పండగ చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ మొత్తం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పేరే వినిపిస్తోంది. రివ్యూలు పాజిటివ్‌గా తెచ్చుకున్న ది గోట్ లైఫ్ ఆడు జీవితం, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ న్యూ ఎంపైర్‌ను పక్కన పెట్టి మరీ యూత్ ఆడియెన్స్ టిల్లు గాడి అల్లరి చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో వసూళ్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.
దీంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ మూడో భాగాన్ని కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. సెకండ్ పార్ట్ ఎండ్ కార్డ్‌లోనే ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. టిల్లు ఫ్రాంచైజీ ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవ్వడం మంచి నిర్ణయమే. కానీ ఇక్కడ ఓ చిన్న రిస్క్ మాత్రం కనిపిస్తోంది.
అదేంటంటే టాలీవుడ్లో ఇప్పటి వరకు సీక్వెల్స్ విషయంలో రెండు భాగాలు మాత్రమే కనిపించాయి. బాహుబలి, కేజీఎఫ్(కన్నడ), ఎఫ్ 2, 3 సహా పలు చిత్రాలు. అయితే బాలీవుడ్లో మాత్రం ఫ్రాంచైజీలూ మూడు నాలుగు పార్టులుగా కూడా తెరకెక్కాయి. హౌస్ ఫుల్ ఫ్రాంచైజీలో 5వ చిత్రం రెడీ అవుతోంది. గోల్ మాల్ 3, టైగర్ 3, ఫక్రే 3, సింగం 3 ఇలా చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని సక్సెస్ అవ్వగా మరి కొన్ని నిరాశ పరిచాయి. కానీ టాలీవుడ్లో ఇలాంటి ప్రయోగం ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదనే చెప్పాలి! పుష్ప 3 అన్నారు కానీ ఇంకా రెండో భాగమే విడుదల కాలేదు. కల్కి కూడా మూడు భాగాలు అన్నారు కానీ మొదటి పార్టే ఇంకా రిలీజ్ కాలేదు. కాబట్టి టిల్లు క్యూబ్ ఇప్పుడు మూడో భాగం తెరకెక్కించి సక్సెస్ అందుకోవడమంటే పెద్ద బాధ్యతనే చెప్పాలి. ఇది కనుక నిజమైతే మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టినట్టే.
అయితే ఈ పార్ట్ 3కి సంబంధించి ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ పనులు మొదలుకాలేదని తెలిసింది. కథ లైన్ ఉంది కానీ స్టోరీ మొత్తం డెవలప్ కాలేదు. పైగా ఈసారి స్టోరీ ఫార్మాట్ మారుస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు అమ్మాయి చేతిలో మోసపోయే థీమ్‌ను చూపించారు. ఇప్పుడా థీమ్ బ్యాక్ లేయర్లో పెట్టి మరో కొత్త పాయింట్‌ను తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ కథ కోసం నేహా శెట్టి, అనుపమ పరమేశ్వరన్‌లను దీటుగా మ్యాచ్ చేసే హీరోయిన్ను సెలెక్ట్ చేసుకోవడం, బోల్డ్ కంటెంట్ డోస్ కూడా పెంచడం ఛాలెంజ్ లాంటిది. దర్శకుడిగా మల్లిక్ రామ్‌ను కొనసాగిస్తారా లేదంటే మళ్లీ మారుస్తారా అనేది తేలియాలి. ఏదేమైనా టిల్లు క్యూబ్‌ను 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మోత మోగిస్తున్న టిల్లు స్క్వేర్ - ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? - Tillu Square OTT
టిల్లన్న మాస్ జాతర - డే 2 కూడా సాలిడ్ కలెక్షన్స్! ఎన్ని కోట్లంటే? - Tillu Square Collections