Disha Patani Latest Tattoo : బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ దిశా పటానీ కల్కి సినిమాతో తెలుగువారికి మరోసారి దగ్గరైంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించిన ఈ చిన్నది, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈమె చేతిపై ఉన్న ఓ టాటూ వల్ల ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఆమె చేతిపై "PD" అనే టాటూతో కనిపించింది. తాజాగా కనిపించిన ఈ టాటూ చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రభాస్, దిశా రిలేషన్లో ఉన్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
"PD" అనే లెటర్స్ ప్రభాస్ డార్లింగ్ అంటూ డీకోడింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా చేసి ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇది దిశా పటాని పేరులోని అక్షరాల రివర్స్ కూడా కావచ్చని కొందరి మాట. ఏదీ ఏమైనప్పటికీ ఈ విషయంపై దిశా క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్‌కు చెక్ పడదని ఫ్యాన్స్ అభిప్రాయం.
Disha Patani's new tattoo is reveal got me to reevaluating my own ink game. That confidence though of #DishasMysteryPDTattoo pic.twitter.com/hDcn44McHL
— Kayal (@kayal_offl) July 1, 2024