Kamalhassan Bharateeyudu Interesting facts : దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమాజాన్ని మేల్కొలిపేలా, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు మరోసారి అలాంటి తరహా సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే భారతీయుడు 2. ఈ నెల 12న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తొలి భాగం భారతీయుడుతో ఎలాంటి రికార్డులు సృష్టించారు. ముందుగా ఏ హీరోలతో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నారు. వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
- శంకర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆయన ప్రతిభను గుర్తించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేయాలనుకున్నారు. దీంతో రజనీ కోసం పెరియ మనుషన్ అనే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు శంకర్. కానీ, ఆ తర్వాత రజనీ బిజీ అవ్వడంతో దాన్ని చేయలేకపోయారు. ఇక శంకర్ ఆ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి ఇండియన్ (భారతీయుడు)గా తెరకెక్కించారని సమాచారం.
- ముందుగా సేనాపతి పాత్రలో రాజశేఖర్, ఆయన కుమారుడిగా వెంకటేశ్ లేదా నాగార్జునను ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. తర్వాత తమిళ నటులు కార్తిక్, సత్యరాజ్‌లతో చేయాలనుకున్నారు. అవి కుదరలేదు. చివరకు కమల్ హాసన్ ఓకే చేశారు. ద్విపాత్రాభినయం చేసేందుకు ఆసక్తి చూపారు.
- అనంతరం హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నారు. అదీ కుదరలేదు. దీంతో బొంబాయి మనీషా కొయిరాలను తీసుకున్నారు.
- రెండో హీరోయిన్‌గా రంగీల ఊర్మిళను నిర్మాత ఏఎం రత్నం ఎంపిక చేశారు. సేనాపతి భార్య పాత్ర కోసం ముందుగా రాధికను అనుకున్నారు కానీ చివరకు సుకన్య ఎంపిక చేశారు.
- కమల్‌ను సేనాపతిగా చూపించింది ఆస్కార్ విజేత, హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్ వెస్ట్‌మోర్.
- సినిమాలో ప్రాచీన యుద్ధకళల గురించి చూపిస్తారు. అందుకోసం మాస్టర్ ఆసాన్ రాజేంద్రన్ వద్ద మర్మకళలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
- టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో శంకర్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఫుటేజీలోని కొన్ని దృశ్యాలను తీసుకుని మరీ వాటిల్లో కమల్ హాసన్‌ను చూపించగలిగారు.
- 1996 మే 9న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా కోలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
- బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌కు ఎంట్రీ పొందింది. కానీ నామినేట్ కాలేదు. బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్‌లో నేషనల్ అవార్డ్స్‌ను దక్కించుకుంది.
- ఎ.ఆర్. రెహమాన్ సినిమాకు సంగీతం అందించారు. పచ్చని చిలుకలు తోడుంటే పాటైతే ఎవర్‌గ్రీన్. ఈ పాట రిలీజైన కొన్ని రోజుల్లోనే పాతిక లక్షల ఆడియో క్యాసెట్లు అమ్ముడుపోయాయి.
'భారతీయుడు 2' బుకింగ్స్ - టికెట్ రేట్స్ ఎంత పెంచారంటే?
'భారతీయుడు 2'కు మర్మకళ చిక్కులు - సినిమా ఆపాలంటూ పిటిషన్- విడుదల సాధ్యమేనా? - Kamal Haasan Indian 2