ETV Bharat / entertainment

హాలీవుడ్​లోకి ధనుష్- ఎంట్రీ 'అవెంజర్స్​'తోనే - Dhanush In Avengers - DHANUSH IN AVENGERS

Dhanush In Avengers: కోలీవుడ్ స్టార్ ధనుష్​కు టాలీవుడ్​లోనూ బోలెడంత క్రేజ్ ఉంది. ఇప్పుడు ధనుష్ హాలీవుడ్​లోనూ మెరవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Dhanush In Avengers
Dhanush In Avengers (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 7:38 PM IST

Dhanush In Avengers: హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ అవెంజర్స్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కళ్లు చెదిరే గ్రాఫిక్స్, వేరే ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లేలా వుండే విజువల్ ఎఫెక్ట్ కారణంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అవెంజర్స్ సినిమాలను తెగ ఇష్టపడుతుంటారు. రస్సో బ్రదర్స్ తెరకెక్కించిన అవెంజర్స్ చిత్రాల్లో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రతి సిరీస్ స్ట్రెయిట్ ఇండియన్ సినిమాలతో పోటీ పడి మరీ వసూళ్లు సాధించింది.

రస్సో బ్రదర్స్ చివరగా విడుదల చేసిన 'అవెంజర్స్ : ది ఎండ్ గేమ్' చిత్రం ఇక అవెంజర్స్ కథ ముగిసింది అన్నట్లుగా ఉంటుంది. దీంతో అవెంజర్స్ సిరీస్ ఇక ఉండవనీ అంతా అనుకున్నారు. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ పడుతున్న సమయంలో జూలై 2024లో మళ్లీ ఆశ్చర్చకరమైన కబురు తెలిపారు రస్సో బ్రదర్స్. మార్వెల్ ప్రపంచానికి ప్రజలను మళ్లీ తీసుకెళతానంటూ ఆశలు రేకెత్తించే ప్రకటన చేశారు. అవెంజర్స్ కథ ఇంకా ముగిసిపోలేదనీ, త్వరలోనే మరో రెండు సిరీస్ రాబోతున్నామని వారు వెల్లడించారు. 'అవెంజర్స్: డూమ్స్ డే' పేరుతో ఒకటి, 'అవెంజర్స్ సీక్రెట్ వార్స్' అంటూ మరొకటి 2026, 2027 సంవత్సరాల్లో వరుసగా విడుదల కాబోతున్నట్లు మార్వెల్ స్టూడియోస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్నారట.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఈ సిరీస్​లో భాగం కానున్నారనే వార్తలు ప్రస్తుతం బాగా వినిపిస్తున్నాయి. తాజాగా 'రాయన్' సినిమాతో తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తన విలక్షణ నటనతో కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ మాస్టారు ఇప్పుడు హాలీవుడ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారని సమాచారం.

ధనుష్ ముఖ్య పాత్రలో వచ్చిన 'ది గ్రే మ్యాన్' సినిమాకు రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మార్క్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ది గ్రే మ్యాన్' ప్రముఖ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం అవుతోంది. ఈ చిత్రంతో ధనుష్ ను బాగా దగ్గరగా చూసిన రూసో బ్రదర్స్ 'అవెంజర్స్: డూమ్స్ డే'లో నటించే అవకాశం ఆయనకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ధనుశ్ 'రాయన్' రివ్యూ- సినిమా ఎలా ఉందంటే? - Dhanush Raayan Movie Review

ధనుశ్ 'రాయన్' సెన్సార్ టాక్ - ఎలా ఉందంటే? - Raayan Censor Review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.