ETV Bharat / entertainment

'దేవర' వచ్చేది అప్పుడే - న్యూ రిలీజ్ డేట్ రివీల్ - దేవర పార్డ్ 1 రిలీజ్ డేట్

Devara Part 1 Release Date : జూనియర్​ ఎన్​టీఆర్​ దేవర మూవీకి ఓ కొత్త రిలీజ్ డేట్​ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రానుందంటే ?

Devara Part 1 Release Date
Devara Part 1 Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 4:45 PM IST

Updated : Feb 16, 2024, 5:17 PM IST

Devara Part 1 Release Date : జూనియర్ ఎన్​టీఆర్, కొరాటల శివ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. తాజాగా ఈ మూవీకి ఓ కొత్త డేట్​ను మేకర్స్ ప్రకటించారు. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్​ 10న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ సినిమాను మేకర్స్​ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కొత్త డేట్​ను ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇందులో జూనియర్ ఎన్​టీఆర్ లుక్​ కూడా చాలా కొత్తగా ఉందని నెటిజ అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల కాదన్న వార్తలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అసలు కారణమేంటా అని నెట్టింట తెగ ఆరా తీశారు.

అయితే ఈ సినిమాలోని విలన్​ రోల్​ పోషిస్తున్న బాలీవుడ్​ స్టార్​ హీరోకు ఇటీవలే గాయలయ్యాయి. సెట్స్​లో యాక్షన్​ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన మూవీ యూనిట్ ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందని సమాచారం. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన పాటలను కంపోజ్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారట. ఇప్పటి వరకు ఫస్ట్ సాంగ్​ కూడా పూర్తవ్వలేదని టాక్​ నడుస్తోంది. ఇది కూడా వాయిదాకి కారణం కావొచ్చని సినీ విశ్లేషకుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా చిత్రీకరణ కూడూ కాస్త లేట్ అవుతోందని అందుకే మూవీకి కొత్త రిలీజ్ డేట్​ను ఫిక్స్​ చేశారని సమాచారం.

ఇక ఏప్రిల్​ 5కి సూర్య 'కంగువ', అక్షయ్​ కుమార్​ 'బడే మియాన్ చోటే మియాన్', అజయ్ దేవగణ్ 'మైదాన్' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది కూడా దేవర వాయిదాకు మరో కారణం అని సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ ఇప్పటి విడుదల తేదీతో ఫ్యాన్స్​లో కాస్త ఉత్సాహాన్ని నింపుతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తారక్ లైనప్​ - ఫుల్ కన్ఫ్యూజన్​ బాస్!

NTR : తొలి సినిమాకు రూ.4 లక్షలు రెమ్యునరేషన్​ - 'దేవర'కు ఎన్ని కోట్లంటే?

Last Updated : Feb 16, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.