ETV Bharat / entertainment

'దేవర OTT' డేట్ లాక్- స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే? - DEVARA PART 1 OTT

దేవర పార్ట్ 1 ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరి ఈ సినిమా ఎప్పట్నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందంటే?

Devara Part 1 OTT
Devara Part 1 OTT (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 3:29 PM IST

Devara Movie OTT : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ 'దేవర పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. సెప్టెంబర్ 27న రీలీజైన ఈ మూవీ ఇప్పటికే వరల్డ్​వైడ్​గా రూ.500+ కోట్ల వసూళ్లు సాధించింది. మూడు వారాల నుంచి ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దసరా తర్వాత కూడా లాంగ్​ రన్​లో దూసుకుపోతోంది. దీంతో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక థియేటర్లలో అలరిస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ సంస్థ, దేవర సినిమా డిజిటల్ రైట్స్​ భారీ ధరకు దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా 2024 నవంబర్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మరి పాన్ఇండియా రేంజ్​లో రిలీజైన మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్​కు అందుబాటులోకి రానుందో కూడా తెలియాల్సి ఉంది. త్వరలోనే నెట్​ఫ్లిక్స్​ దీన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీపావళి కంటే ముందే ఈ సినిమా రిలీజై నాలుగు వారాలు కంప్లీట్ చేసుకుంటుంది. దీంతో దీపావళి సందర్భంగానూ ఓటీటీలోకి తీసుకొచ్చే ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఇక దేవర ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రకారమే వస్తుందా? లేదా దీపావళికి రీలీజ్ చేస్తారా అని చూడాలి.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్​డ్రాప్​లో హై లెవెల్ గ్రాఫిక్స్​తో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా కనిపించారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించి అభిమానులను అలరించారు.

'దేవర'లో సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ సంగీతం అందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కింది. దేవర-1 భారీ హిట్ అవ్వడం వల్ల దాని సీక్వెల్ పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఆ ఏరియాల్లో రోజుకు రూ.కోటి వసూలు! - సీడెడ్​లో 'దేవర' అరుదైన రికార్డు!

'దేవర 2' విషయంలో కొరటాల శివ ప్రామిస్ - ' ఆ సీన్స్​ ఫ్యాన్స్​కు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.