Deepika Padukone First Movie Remuneration : సూపర్ స్టార్ పక్కనే తొలి సినిమా. ఈ మాట విన్న ఏ నటి అయినా ఎగిరి గంతేస్తుంది. దీపికా పదుకుణె కూడా అలానే చేసింది. తన తొలి సినిమా బీటౌన్ బాద్షా షారుక్‌ఖాన్‌తో సినిమా అనేసరికి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డ్రీమ్‌గర్ల్ శాంతిప్రియగా మెరిసి యువతను మైమరిపించింది. దీంతో తొలి సినిమాతోనే ఈ అమ్మడు ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆ చిత్రానికి ఒక్క రూపాయి కూడా రెమ్యూరేషన్ తీసుకోకుండానే నటించిందట. దీనికి గల కారణం ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
షారూక్‌తో కలిసి సినిమా చేయడమే ఆమె పెద్ద గిఫ్ట్‌గా భావించానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొణె. ఆ తర్వాతనే బీటౌన్లోకి ఎంట్రి ఇచ్చింది. తొలి సినిమాతో ఎంతో మంది డైరెక్టర్లకు క్లిక్ అయిన ఈ స్టార్, ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్‌లోకి టాప్ హీరోయిన్గా ఎదిగింది. హిందీలోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లోనూ మెరిసింది. హాలీవుడ్‌లోనూ పాపులరైంది. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను పలకరించనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ సినిమాలన్నీ వంద కోట్ల క్లబ్వే
ఇప్పటి వరకు ఆమె కెరీర్లో రూ.100 కోట్ల వసూలు చేసిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. 'లవ్ ఆజ్ కల్' (రూ.117.27 కోట్లు), 'రేస్ 2' (రూ.162 కోట్లు), 'కాక్ టైల్' (121.78 కోట్లు),'యే జవానీ హై దివానీ' (రూ.318 కోట్లు), 'గోలియోం కీ రాస్లీలా రామ్ లీలా' (రూ. 218.07 కోట్లు), 'చెన్నై ఎక్స్‌ప్రెస్' (రూ.422 కోట్లు), 'పీకూ' (రూ.141.30 కోట్లు), 'హౌజ్ ఫుల్' (రూ.124.50 కోట్లు), 'పద్మావత్' (రూ.585 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్' (రూ.397 కోట్లు), 'బాజీరావ్ మస్తానీ' (రూ.184 కోట్లు), '83' (రూ.193 కోట్లు), 'ఫైటర్' (రూ.358 కోట్లు) ఇవే కాకుండా ఇటీవలే విడుదలైన 'పఠాన్', 'జవాన్' సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరిపోయాయి.
ప్రమోషనల్ ఈవెంట్స్‌కు నో చెప్పిన దీపికా! - కారణం ఏంటంటే ?
'తిండి కోసం కష్టపడ్డా - అర్ధరాత్రుళ్ల దాకా పని చేసి క్యాబ్‌లో నిద్రపోయా'