ETV Bharat / entertainment

దసరా వీకెండ్ స్పెషల్ - ఓటీటీలోకి 4 సూపర్ హిట్​ సినిమాలు, 2 సిరీస్​లు - DASARA OTT FRIDAY RELEASES

ఈ దసరా వీకెండ్​ కానుకగా ఓటీటీలోకి వచ్చిన నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు, రెండు వెబ్​సిరీస్​లు.

source ETV Bharat and Getty Images
OTT Friday Releases (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 5:24 PM IST

OTT Friday Releases : ఓటీటీ ప్లాట్​ఫామ్​లో దసరా ఉత్సవాలు రెండు రోజుల ముందే ప్రారంభం అయిపోయాయి. గురువారమే (అక్టోబర్ 10) పలు చిత్రాలు, సిరీస్​లు ఓటీటీల్లోకి అడుగుపెట్టగా, శుక్రవారం (అక్టోబర్ 11) కూడా పలు చిత్రాలు, సిరీస్​లు స్ట్రీమింగ్​కు వచ్చాయి. దీంతో ఈ వీకెండ్​లో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో ఇక్కడ చూసి వివరాలను తెలుసుకోండి.

ఓటీటీల్లోకి రాబోతున్న సినిమా, సిరీస్​లివే

మత్తు వదలరా 2 (నెట్‌ఫ్లిక్స్​) - ఈ ఏడాది గత నెలలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న మత్తు వదలరా 2 నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి అడుగుపెట్టేసింది. శుక్రవారం (అక్టోబర్ 11) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో కమెడియన్ సత్య కామెడీ బాగా సెన్సేషనల్ అయింది. కాబట్టి ఈ వీకెండ్​ మీరు నవ్వుకోవాలంటే ఈ సినిమాను ఎంచక్కా చూసేయండి.

వాళై (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) - సూపర్​ హిట్​ తమిళ చిత్రం 'వాళై' కూడా ఈ శుక్రవారమే ఓటీటీలోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో వాళై అంటే అరటి పండు అని అర్థం. అరటి తోటనే నమ్ముకుని బతికే తమ జీవితాల్లో ఎదుర్కొనే సవాళ్లను ఈ వాళై సినిమాలో అద్భుతంగా చూపించారు.

స్త్రీ 2 (ప్రైమ్ వీడియో) - ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రాల్లో హారర్ కామెడీ స్త్రీ 2 కూడా ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే అద్దె విధానంలో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. శుక్రవారం (అక్టోబర్ 11) నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం కూడా భయపెడుతూనే నవ్వులు పూయించింది.

శబరి (సన్ నెక్ట్స్) - ఈ శబరి చిత్రం అక్టోబర్ 11 నుంచి సన్‍నెక్స్ట్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్​కు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. శబరి సినిమా థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత సన్‍ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది.

వెయ్ దరువెయ్ (ఆహా వీడియో) - ఫేక్ స‌ర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు సంపాదించాలని భావించి అడ్డ‌దారులు తొక్కుతున్న యువ‌త ఎలాంటి క‌ష్టాల పాల‌వుతున్నార‌నే సందేశానికి క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించి ద‌ర్శ‌కుడు వెయ్​ దరువెయ్​ మూవీని తెర‌కెక్కించాడు. థియేటర్లలో విడుదలైన ఏడు నెలల తర్వాత ఈ వెయ్ దరువెయ్ ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో సాయిరాం శంకర్, య‌శ్న హీరో హీరోయిన్లుగా నటించారు. సునీల్‌, స‌త్యం రాజేశ్​ ప్రధాన పాత్రలు పోషించారు.

జై మహేంద్రన్ (సోనీలివ్ ఓటీటీ) - జై మహేంద్రన్ అనే ఓ మలయాళ వెబ్ సిరీస్. శుక్రవారం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సైజు కురుప్ ఈ సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించారు.

రాత్ జవానీ హై (సోనీలివ్) - హిందీ వెబ్​ సిరీస్ రాజ్ జవానీ హై కూడా సోనీలివ్​లోనే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సిరీస్​ స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథా ఈ సిరీస్.

నిఖిల్ 'స్వయంభు' - ఆయుధపూజ మొదలు

అమితాబ్- రజనీ కాంబోలో 4 మూవీస్ - అన్నీ సూపర్ హిట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.