Dasara Director Srikanth Comments : నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే దాదాపు రూ.100 కోట్లకు పైగా కలెక్షను సాధించి సూపర్ హిట్‌ను అందుకున్నారు. దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీకాంత్ గెస్ట్‌గా వచ్చారు. ఈ వేడకలో తన జీవితంలో సినిమాల కోసం చేసిన ఓ పని గురించి అభిమానులతో పంచుకున్నారు.
'నేను మొదట ఇంటర్ ఫెయిల్ అయ్యాను. ఒకవేళ పాస్ అయితే మా నాన్న నన్ను బీటెక్ చదివించాలనుకున్నాడు. అందుకనే కావాలనే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. దాని తర్వాత ఫిల్మ్ స్కూల్లో జాయిన్ కావాలంటే, ఇంటర్ పాస్ అవ్వాలని తెలిసింది. దీంతో ఇంటర్ పాస్ అయ్యి ఫిల్మ్ స్కూల్లో చేరాను. అయితే అక్కడ కూడా నేను ఫెయిల్ అయ్యాను. అయితే నన్ను బీటెక్ చేయమని మళ్లీ మా నాన్న, బాబాయి పట్టుబట్టారు. కనీసం డిగ్రీ అయిన చేయాలని అన్నారు. నా దగ్గర ఇంటర్ సర్టిఫికెట్ ఉంది. అందుకే వీళ్లందరు బీటెక్, డిగ్రీ చేయమని అడుగుతున్నారని కోపం వచ్చి ఓ రోజు నా ఇంటర్, టెన్త్, 7వ తరగతి సర్టిఫికెట్లను తగలబెట్టాను' అని శ్రీకాంత్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
'వీడేవాడురా బాబు సేమ్ నా సీనే తీశారు'
ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయని చెప్పారు. 'వివేక్ తీసిన 'బ్రోచేవారెవరురా' సినిమాలో ఉన్న ఇలాంటి సీన్ చూసి వీడేవాడురా బాబు సేమ్ నా సీనే రాశారని అనుకున్నా' అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీటీమ్ పాల్గొని సందడి చేసింది. సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా అంటూ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
టైటిల్లో 'శనివారం'- రిలీజ్ 'గురువారం-' ఎందుకలా?- నాని ఆన్సర్ ఇదే - Nani Saripodhaa Sanivaraam
'సరిపోదా శనివారం' స్టోరీ రివీల్- నాని పాత్ర ఎలా ఉండనుందంటే? - Nani Saripodhaa Sanivaaram