Committee Kurrollu OTT: యువ నటీనటులతో కొత్త దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన 'కమిటీ కుర్రోళ్లు' ఆగస్టు 9న రిలీజై మంచి విజయం సాధించింది. థియేటర్లలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఈ సెప్టెంబర్ నుంచి ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని ఈటీవీ విన్ అఫీషియల్‌గా ప్రకటించింది. 'ఈ 11 మంది కొత్త కమిటీ కుర్రోళ్లు సెప్టెంబర్‌లోనే రాబోతున్నారు. మన కమిటీ కుర్రోళ్లు బయల్దేరిపోయారు' అని క్యాప్షన్ రాస్తు, ఈటీవీ విన్ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. కానీ, విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబరు తొలి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలున్నాయి. ఇక పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారికా కొనిదెల ఈ సినిమా నిర్మించారు.
ఈ 11 మంది కొత్త కమిటీ కుర్రోళ్లు సెప్టెంబర్ లోనే రాబోతున్నారు..
— ETV Win (@etvwin) August 30, 2024
మన కమిటీ కుర్రోళ్లు బయదెల్లిపోయేరు...@PinkElephant_P @IamNiharikaK
Say hello to #CommitteeKurrollu pic.twitter.com/hO08KLScxg
ఇదే కథ: గోదావరి జిల్లాల్లో పురుషోత్తంపల్లి అనేది ఓ మారుమూల పల్లెటూరు. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగే భరింకాళమ్మతల్లి జాతరకు దానిలో భాగంగా చేసే బలి చేట ఉత్సవానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అయితే ఈసారి జాతర జరిగిన పదిరోజులకు ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఆ ఊరి ప్రస్తుత సర్పంచ్ బుజ్జి (సాయికుమార్)పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్లలో ఒకడైన శివ (సందీప్ సరోజ్) ముందుకొస్తాడు. అయితే గత జాతర సమయంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జాతర పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టకూడదని పంచాయితీలో ఊరి పెద్దలు తీర్పునిస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఈసారి జాతర ఎలా జరిగింది? పన్నెండేళ్ల క్రితం కులాల గొడవ వల్ల విడిపోయిన శివ మిత్ర బృందం తిరిగి ఎలా ఒక్కటయ్యింది? ఊరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అన్నది మిగిలిన కథ.
'సినిమా చూస్తున్నంతసేపు ఆ విషయం మర్చిపోయా'- కమిటీ కుర్రోళ్లుపై చిరు - Committee Kurrollu