ETV Bharat / entertainment

అత్తమ్మ బర్త్​ డే స్పెషల్​ - మరో గుడ్ న్యూస్​తో ఉపాసన సర్​ప్రైజ్​ - Upasana New Food Business

నేడు మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి వినుత్నంగా ఓ కవితను రాసి సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీరి ముద్దుల కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల కూడా తన అత్తమ్మ సురేఖకు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపింది. అలాగే ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఇంతకీ ఉపాసన చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం.

స్పెషల్
స్పెషల్
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 4:54 PM IST

Chiranjeevi Wife Birthday : మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చరణ్​ను పెళ్లి చేసుకున్నాక అటు ఇంటి బాధ్యతలను మరోవైపు వ్యాపార బాధ్యతలను బ్యాలెన్సింగ్ చేసుకుంటూ లైఫ్​ను గడుపుతోంది. అలానే సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటోంది. అయితే తాజాగా ఆమె ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా తన అత్తమ్మ చిరంజీవి భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా.

Upasana New Food Business : నేడు సురేఖ పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి కూడా రేఖ - జీవన రేఖ అంటూ ఓ కవితను రాసుకువచ్చారు. భార్య సురేఖకు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలానే ఉపాసన కూడా తన అత్తమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను ఓ వ్యాపారన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇన్ స్టా వేదికగా ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసంది. అత్తమ్మాస్ కిచెన్ పేరుతో కొత్త వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లు వీడియోలో పేర్కొంది. ఈ వ్యాపారన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని ఇన్ స్టాలో రాసుకువచ్చింది. రుచి సంప్రదాయాన్ని కలిసే చోట బంధాలు తరతరాలుగా నిలబడతాయి, సిద్ధంగా ఉన్న ఆహారాన్ని ఆస్వాదించండి - నేరుగా మా వంటగది నుంచి మీ ఇంటికి అంటూ రాసుకొచ్చింది.

తన ఇన్​స్టాలో ఇచ్చిన ఆన్​లైన్​ వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ వంటకాలను బుక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చని చెప్పింది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని చెప్పుకొచ్చింది. మరి కేవలం హైదరాబాద్​లోనే పంపిణీ చేస్తారా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఉపాసన పెట్టిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Ramcharan Movies : ఇక రామ్​చరణ్ విషయానికొస్తే ఆయన త్వరలోనే శంకర్ దర్శకత్వంలో గేమ్​ ఛేంజర్ అనే సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్ డ్రామా ఒకటి చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్​పైకి వెళ్లనుంది.

కానిస్టేబుల్‌ ఎగ్జామ్​కు అప్లై చేసిన సన్నీ లియోన్!

దసరా బరిలో చైతూ - దేవరతో తండేల్​ బాక్సాఫీస్ ఫైట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.