Chiranjeevi Viswambara Shooting : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ త్రిష హీరోయిన్గా నటిస్తోంది. శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం ఓ షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్, ఓ సాంగ్ కంప్లీట్ చేసిందని మూవీటీమ్ తెలిపింది. ఇక ఇప్పుడు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలిసింది.
హైదరాబాద్‌లోని శివారు ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో షూటింగ్ చేస్తున్నారట. లక్ష బీర్ బాటిళ్లతో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఇంటర్వెల్‌కు ముందు రాబోయే ఈ సీన్ కోసం చిరు 68 ఏళ్ల వయసులోనూ ఎన్నో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవి, కొంతమంది ఫైటర్ల మధ్య దీన్ని షూట్ చేస్తున్నారట. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఇది జరుగుతోందని తెలుస్తోంది. భారీ స్థాయిలో షూట్ చేస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా ఉండనుందని మూవీ టీమ్ చెబుతోంది. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుడికి ఇది మరింత థ్రిల్ పంచుతుందని అంటున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించినట్లు మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరు కనిపించనున్నారట. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Viswambara Movie Budget : యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీగా సినిమా రాబోతుంది. దీంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. త్రిష డబుల్ రోల్లో కనిపిస్తుందని అంటున్నారు(Viswambara Heroines). ఇంకా సురభి, ఇషాచావ్లా తదితరులు కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చూడాలి మరి ఇన్ని హంగులతో తెరకెక్కుతోన్న ఈ సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న చిరుకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సావిత్రి ముందు డాన్స్ చేస్తూ కాలుజారి పడ్డా- నాగుపాము స్టెప్ అదే: చిరు - Chiranjeevi Savithri
కోపంతో ఊగిపోయి నాగబాబును కొట్టిన చిరంజీవి! - Chiranjeevi Nagababu