ETV Bharat / entertainment

ఇండిపెండెన్స్ డే: సెలబ్రిటీల విషెస్- 'కల్కి' స్పెషల్ పోస్టర్ - Independence Day Greetings

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 11:53 AM IST

Celebraties Wishes Independence Day Greetings: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Independence Day Greetings
Independence Day Greetings (Source: ETV Bharat)

Celebraties Wishes Independence Day Greetings: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశమంతా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా ఆడియెన్స్​కు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంక్ వర్మ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్​లో పోస్ట్​లు షేర్ చేశారు. ఇక ప్రభాస్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కల్కి' మూవీ టీమ్​ కూడా ఇండిపెండెన్స్​ డే విషెస్ తెలిపింది.

  • దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీని కోసం మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారు. వాళ్లందరినీ స్మరించుకుందాం. వారిని ఆదర్శంగా తీసుకుందాం. జైహింద్- చిరంజీవి
  • అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- జూనియర్ ఎన్టీఆర్
  • ఈ ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు- అల్లు అర్జున్

కల్కి స్పెషల్ పోస్టర్
రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి ఏడీ 2898' గురువారానికి దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆడియెన్స్​కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, జూన్ 27న రిలీజైన ఈ సినిమా అనేక రికార్డులు బద్దలుకొట్టి, వరల్డ్​వైడ్​గా రూ.1100+ కోట్ల వసూళ్లు సాధించింది.

Kalki 2898 AD OTT: తాజాగా 50రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఆగస్టు 23నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ఇన్​సైడ్ వర్గాల టాక్. అయితే థియేటర్ వెర్షన్ కాకుండా సినిమాను కాస్త ట్రిమ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అసలు రన్​టైమ్​లో దాదాపు 6నిమిషాల ఫుటేజీ కట్ చేయనున్నారని సమాచారం. అయితే ఓటీటీ రిలీజ్, రన్​టైమ్​ గురించి ఇంకా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

'కల్కి' ర్యాంపేజ్ కంటిన్యూ- దెబ్బకు షారుక్ సినిమా రికార్డ్ బ్రేక్ - Kalki Boxoffice

పాకిస్థాన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్- అంతా ఆ స్టార్ డైరెక్టర్ ప్లాన్! - Prabhas Pakistan Heroine

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.