ETV Bharat / entertainment

30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో ఇండియన్ ఫిల్మ్​ - మూవీటీమ్​కు స్టాండింగ్ ఒవేషన్ - Cannes Film Festival 2024

Cannes Film Festival 2024 Indian Movie : కేన్స్‌ ఉత్సవంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం పోటీలో నిలిచింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source The Associated Press
Cannes Film Festival 2024 Indian Movie (Source The Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 1:29 PM IST

Cannes Film Festival 2024 Indian Movie : ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గ్రాండ్​గా సాగుతోంది. ఈ వేడుకల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం పోటీలో నిలిచింది. అదే మలయాళీ సినిమా ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ (All We Imagine as Light). పామ్‌ డి ఓర్‌ (Palme d'Or) అవార్డుల కేటగిరీలో పోటీలో నిలిచింది. మే 23న ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. మిడిల్ క్లాస్​ యువతుల జీవితాలు, వారి భావోద్వేగాలతో ముడిపడిన ఈ చిత్రానికి విశేష ఆదరణ కూడా దక్కింది. అందరూ లేచి నిలబడి చప్పట్లతో ప్రశంసించారు. ఈ సందర్భంగా మూవీటీమ్ కూడా రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది. దర్శకురాలు పాయల్‌ కపాడియాతో పాటు నటీనటులు రెడ్ కార్పెట్​పై సందడి చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.

కాగా, పాయల్‌ కపాడియా దర్శకత్వం వచ్చిన తొలి ఫీచర్‌ సినిమా కూజా ఇదే కావడం విశేషం. అలానే ఈ కేన్స్​లో భారత్‌ నుంచి ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ పోటీలో నిలవడం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. గతంలో 1994లో స్వహం సినిమా పామ్‌ డి ఓర్‌ కేటగిరీలో పోటీ పడింది. మళ్లీ ఇప్పుడు ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌ పోటీ పడుతోంది. దీంతో పాటు యోర్గోస్ లాంతిమోస్, ఓహ్ కెనడా, మెగాలోపోలిస్, అనోరా, బర్డ్ సహా తదితర సినిమాలు ఈ బరిలో నిలిచాయి. వీటిల్లో విజేతను మే 25న అనౌన్స్ చేయనున్నారు. అంతకుముందు పాయల్ కపాడియా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఎ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌ 2021 కేన్స్​లో ఉత్తమ డ్యాకుమెంటరీగా అవార్డను ముద్దాడింది.

ఈ సినిమా కథేంటంటే? - కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబయి నర్సింగ్‌ హోమ్‌లో పనిచేస్తుంటారు. అయితే వీరిద్దరు తమ తమ రిలేషన్‌షిప్స్‌లో చాలా ఇబ్బందులు పడుతూనే జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఓ సారి ఇద్దరు కలిసి ఓ బీచ్‌ టౌన్‌కు రోడ్‌ ట్రిప్‌కు వెళ్లగా అక్కడ వారికి ఓ అడివి కన్పిస్తుంది. మరి ఆ అడవిలో ఏం జరిగింది? దాని వల్ల వారి జీవితాలు ఎలా మారాయి? అన్నదే ఈ చిత్ర కథ. అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి.

కేన్స్‌లో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కు మొదటి బహుమతి

రూ.15 కోట్ల బడ్జెట్​తో రూ.900 కోట్ల కలెక్షన్లు - ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? - Highest Profits Indian movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.