Suhana Khan Net Worth: షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే 2023లో రిలీజైన 'ద ఆర్కీస్' సినిమాతో పరిచయమైంది. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది. ప్రస్తుతం తన తండ్రితో కలిసి 'కింగ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగేట్రం చేయనుంది. అలానే ఈ ముద్దుగుమ్మ మంచి బిజినెస్ ఉమెన్‌గానూ ఎదగాలని తాపత్రయపడుతోంది. టీవీ అడ్వర్టైజ్మెంట్లు, మోడలింగ్‌లోనూ రాణిస్తోంది.
అయితే ఈ 24 సంవత్సరాల ముద్దుగుమ్మ నెట్‌వర్త్ రూ.13 కోట్లు అని నివేదికల ద్వారా తెలిసింది. 'లక్స్', 'మేబీల్లైన్' వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా చేస్తుందట. అలా రూ.6300 కోట్లున్న షారుక్ ఖాన్ లాంటి రిచెస్ట్ యాక్టర్ కూతురు తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది.
ఫామ్ హౌస్, భూమి కొనుగోలు- అలీబాగ్ ఫామ్ హౌజ్- తండ్రి బాటలో నడుస్తూ రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియో స్టార్ట్ చేసిందట సుహానా. అలీబాగ్‌లోని థాల్ గ్రామంలో ఒక ఫామ్ హౌజ్ కొనుగోలు చేసిందని తెలిసింది. దీని ధర దాదాపు రూ.12.91 కోట్లు అని తెలిసింది. దీని పక్కనే షారుక్ ఖాన్‌కు రూ.14.67 కోట్ల విలువైన బంగ్లా ఉందట. సుహానా ఖాన్ ఫిబ్రవరి 2024లో ఇదే గ్రామంలో రూ.9.5 కోట్ల వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేసిందని తెలిసింది.
లగ్జరీ కారు: అభిమానులకు బహుమతులు ఇవ్వజంలో వెనకాడని షారుక్ ఖాన్, తన కూతురు సుహానా ఖాన్ కోసం ఎక్సెపెన్సివ్ అల్ట్రా లగ్జరీ కారు ఆడి ఏ6 (Audi A6)ని కొని గిఫ్ట్‌గా ఇచ్చారట. దీని విలువ రూ.70లక్షలు.
బాల్మైన్ (Balmain) మినీ డ్రెస్: రిచ్ కిడ్‌లు కామన్‌గానే ఇష్టపడినట్లు సుహానా ఖాన్‌కు కూడా లగ్జరీ బ్రాండ్లు అంటే బాగా ఇష్టమట. 2020 న్యూఇయర్ పార్టీ ఈవెనింగ్‌కు సుహానా వేసుకున్న బాల్మైన్ మినీ డ్రెస్ కూడా అలాంటిదే. గోల్డ్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఆ డ్రెస్ విలువ దాదాపు రూ.2లక్షల 70వేలు అని తెలిసింది. ఇంకా ఆమె దగ్గర కాస్ట్లీ లెదర్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉన్నాయట. సుహానా కూడా తన తల్లి లాగానే హ్యాండ్ బ్యాండ్స్‌ను బాగా ఇష్టపడుతుందట. ఆమె దగ్గర ఉన్న ఓ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ.1.23 లక్షలు అని సమాచారం.
'జవాన్' అరుదైన ఘనత- భారత్‌లో టాప్ మూవీగా రికార్డ్!
Suhana Khan Interview : యాంకర్ ప్రశ్నకు షారుక్ తనయ రిప్లై.. అలాంటి వ్యక్తే ఇష్టమంటూ!