ETV Bharat / entertainment

నామినేషన్స్​ వార్​: ఓజీ క్లాన్​ Vs రాయల్​ క్లాన్​ - మొత్తంగా ఈ వారం నామినేట్​ అయ్యింది వీరే!

బిగ్​బాస్​ సీజన్​ 8లో వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ రాకతో మొత్తంగా కంటెస్టెంట్లు 16 మంది అయ్యారు. దీంతో ఆరోవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మరి వీరిలో ఎవరు నామినేట్​ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం

Bigg Boss 8 Telugu Sixth Week Nominations
Bigg Boss 8 Telugu Sixth Week Nominations (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 2:38 PM IST

Bigg Boss 8 Telugu Sixth Week Nominations: బిగ్‌బాస్​ సీజన్​ 8లో సోమవారం రోజున ఆరోవారం నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది. అయితే ఈసారి వైల్డ్ కార్డ్స్​ రాకతో నామినేషన్స్‌లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. "ఈసారి రాయల్ క్లాన్ రాకతో లెక్కలు మారాయి.. ఐదు వారాల మీ ప్రయాణాన్ని, మీ ఆటతీరు, మీ స్వభావాన్ని ఆడియన్స్‌లాగా చూసి వైల్డ్ కార్డ్స్ ఇక్కడికి వచ్చారు.. కనుక మీపై వారికి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటుంది.. కనుక ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు.. మీకు ఎవరు అనర్హులని భావిస్తే వాళ్లలో ఇద్దరూ ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి.. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు" అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.

ఇక నామినేషన్​ ప్రక్రియను హరితేజ మొదలెట్టింది. మొదటి బంతికే సిక్సర్ అన్నట్లు ఫస్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. ఇక తర్వాత తన సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేసింది హరితేజ. దీంతో వాళ్ల ముగ్గురు మధ్య గట్టిగానే వార్​ నడిచింది.

గౌతమ్ తన నామినేషన్స్ వేయడానికి వచ్చాడు. సీజన్ 7లో పాటించిన అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతూ పంచె కట్టుకొని వచ్చాడు డాక్టర్ బాబు. ఇక తన మొదటి నామినేషన్.. విష్ణుప్రియకి వేశాడు. తన సెకండ్ నామినేషన్ యష్మీకి వేశాడు గౌతమ్. "రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు.. మణికంఠను ప్రతిసారి నిన్నే నామినేట్ చేస్తానని చెప్పడం కరెక్ట్‌గా అనిపించలేదు" అంటూ యష్మీని నామినేట్​ చేశాడు.

నయని పావని.. ముందుగా విష్ణుప్రియను నామినేట్ చేసింది. తన సెకండ్ నామినేషన్ సీతకి వేసింది నయని. ఇక మెహబూబ్.. మొదటిగా సీతను నామినేట్ చేశాడు. యష్మీకి సెకండ్ నామినేషన్ వేశాడు. మొదటి నామినేషన్ సీతకి వేశాడు టేస్టీ తేజ. తన రెండో నామినేషన్ మణికంఠకి వేశాడు తేజ. అలా మణికంఠ మెడలో తేజ బోర్డు వేస్తుంటే యష్మీ చప్పట్లు కొట్టేసి.. "అద్దీ" అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.

ఇక మంగళవాపం ఎపిసోడ్​లో రోహిణి ముందుగా యష్మీని నామినేట్ చేసింది. తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేసింది రోహిణి. "మొదటి వారం చూసినప్పుడు విష్ణు బాగా ఆడుతుందనే ఫీలింగ్ కలిగింది.. కానీ ఆ రేంజ్ నుంచి తర్వాత కిందకి పడిపోయావ్.. నీ కాన్సట్రేషన్ వేరే చోట ఉంది.. నువ్వు రియల్‌గా ఉండు.. అంటే దాని అర్థం టాస్కులన్నీ ఆడి.. ప్రతి దాంట్లో ఎంజాయ్‌మెంట్ వెతుక్కో" అంటూ విష్ణుప్రియకు రోహిణి సలహా ఇచ్చింది.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ఇక నెక్ట్స్ గంగవ్వ నామినేషన్ వేయడానికి వచ్చింది. మొదటిగా విష్ణుప్రియను నామినేట్ చేస్తూ "నువ్వు గేమ్ ఆడట్లేదు.. నీకు కాళ్లు చేతులు సక్కగా లేవా.. ఉన్నా మరెందుకు ఆడట్లే.. ఉత్తిగనే కూసుంటున్నావ్" అంటూ గంగవ్వ అంది. తర్వాత యష్మీకి రెండో నామినేషన్ వేసింది గంగవ్వ.

అవినాష్.. పృథ్వీని మొదటిగా నామినేట్ చేస్తూ ప్రభావతి టాస్కు.. బెలూన్ టాస్కు తప్ప మీరు ఎక్కడా కనిపించలేదు అంటూ తన పాయింట్స్​ చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ నడిచింది. అవినాష్ కూడా యష్మీని నామినేట్ చేశాడు. ఇక తన నామినేషన్ పాయింట్ చెబుతూ " కన్ఫెషన్ రూమ్‌లో మణికంఠకి ఆ ఫుడ్ ఇచ్చేసి ఉంటే మీరు తర్వాత బయటికొచ్చి తనను ఓదార్చే అవకాశం ఉండేది కాదు అనిపించింది" అంటూ యష్మీతో అవినాష్​ అన్నాడు.

ఇక రాయల్స్ క్లాన్ వాళ్ల నామినేషన్ పూర్తయ్యాక నామినేట్ అయిన సభ్యులు యష్మీ, విష్ణుప్రియ, సీత పృథ్వీ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక తర్వాత ఓజీ క్లాన్ ఇప్పుడు మీ వంతు.. మీరు రాయల్స్ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులను అందరూ కలిసి డిస్కస్ చేసుకొని నామినేట్ చేయాలి.. అయితే నిన్న వారు రెండు షీల్డ్స్ గెలుచుకున్నారు.. వారు నామినేషన్ షీల్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.. ఆ షీల్డ్ ఉన్న వారిని మీరు నామినేట్ చేయాలంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి లక్ష రూపాయలు కోల్పోతారు.. కాబట్టి ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

దీంతో ఇరు క్లాన్‌లు వేరువేరుగా డిస్కస్ చేసుకున్నాయి. ఇక ఓజీ క్లాన్​ సభ్యులు మెహబూబ్‌ను మొదటగా నామినేట్ చేశారు. ఇక రెండో నామినేషన్ గంగవ్వకి వేశారు. "సారీ అవ్వ.. ఛాయ్ పెట్టినా.. పాలు ఇచ్చినా ఇవ్వలేదు అన్నావ్.. మా వంతు ఇవ్వగలిగింది ఇచ్చినాం.. ఆ రీజన్‌తో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాం" అంటూ మెగా చీఫ్ నబీల్ చెప్పాడు. అలా మొత్తానికి ఈ వారం నామినేషన్​ ప్రక్రియ పూర్తి కాగా నామినేట్​ అయిన సభ్యులు వీరే..

  • యష్మీ
  • విష్ణుప్రియ
  • సీత
  • పృథ్వీ
  • మెహబూబ్
  • గంగవ్వ

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.