ETV Bharat / entertainment

బిగ్​బాస్​ భారీ షాక్ - మిడ్​ వీక్​ ఎలిమినేషన్​తో ఊహించని దెబ్బ - ఆ ఇద్దరిలో ఇంటికి వెళ్లేదెవరో? - Bigg Boss 8 Mid Week Elimination - BIGG BOSS 8 MID WEEK ELIMINATION

Bigg Boss Mid Week: బిగ్​ బాస్ సీజన్​ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు హౌజ్​ను వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని.. మిడ్​ వీక్​లోనే ఓ కంటెస్టెంట్​ ఇంటికి వెళ్లనున్నారని గత వీకెండ్​ ఎపిసోడ్​లో నాగార్జున చెప్పడంతో.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Bigg Boss 8 Telugu Mid Week Elimination
Bigg Boss 8 Telugu Mid Week Elimination (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 2:43 PM IST

Bigg Boss 8 Telugu Mid Week Elimination: సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా మొదలైన బిగ్​బాస్​ సీజన్​ 8 రసవత్తరంగా సాగుతోంది. గొడవలు, అలకలు, మాటలు, టాస్కులు, లవ్​ట్రాక్స్​తో రంజుగా సాగుతోంది. ఇక ఇంట్లోకి అడుగు పెట్టిన 14 మంది కంటెస్టెంట్లలో నలుగురు ఎలిమినేట్​ అయ్యారు. ఇక ఈ వారం డబుల్​ ఎలిమినేషన్​ ఉంటుందని.. మిడ్​ వీక్​లోనే ఓ కంటెస్టెంట్​ ఇంటికి వెళ్లనున్నారని గత వీకెండ్​ ఎపిసోడ్​లో నాగార్జున చెప్పడంతో.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే లీస్ట్​లో ఉన్న ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్​ కానున్నారని సమాచారం. వారు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నామినేషన్స్​లో ఉన్నది వీళ్లే: నాలుగో వారంలో సోనియా ఆకుల ఎలిమినేషన్​ తర్వాత.. ఐదో వారానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నామినేట్​ చేయాలనుకున్న ఇద్దరి కంటెస్టెంట్ల ఫొటోలను మంటల్లో వేయాలని బిగ్​బాస్​ ప్రకటించాడు. ఇక ఈ నామినేషన్లలో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇక అందరి నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న సభ్యులకి ఒక స్పెషల్ పవర్ ఇస్తూ.. చీఫ్‌లు ఇద్దరిలో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో ఆరుగురు సభ్యులు సీతను సేవ్ చేయాలంటూ హ్యాండ్స్ రెయిజ్ చేశారు. కేవలం పృథ్వీ, యష్మీ మాత్రమే నిఖిల్ వైపు ఉన్నారు. దీంతో నిఖిల్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చాడు. మొత్తంగా ఈ వారం ఆరుగురు సభ్యులు నామినేట్​ అయ్యారు. వారెవరో చూస్తే.. విష్ణు ప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్​, నిఖిల్​..

మిడ్​ వీక్​ ఎలిమినేషన్​ అయ్యేది ఎవరంటే: గత సండే రోజు ఎపిసోడ్​లో.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పాడు. దీంతో ఎవరు వెళ్తారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. సోమవారం రోజు నామినేషన్స్​ ముగియగా.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఓటింగ్​ జరగనుంది. ఇక అన్​ అఫీషియల్​ పోలింగ్స్​ చూస్తే.. ఇప్పటి వరకు నబీల్, నిఖిల్ టాప్​లో ఉన్నారు. వీరితో పాటు విష్ణుప్రియకి కూడా ఓటింగ్​ పెరిగింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో మణికంఠ, ఆదిత్య, నైనిక ఉన్నారు. అయితే నైనిక, ఆదిత్యలకు మధ్య ఓటింగ్​లో చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంది.

బిగ్​బాస్​ 8: "రీలోడ్​ ఈవెంట్​" - వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​పై హింట్​ ఇచ్చిన నాగార్జున - ఎవరొస్తున్నారో తెలిసిపోయిందిగా!!

ఇక్కడో చిన్న ట్విస్ట్​: సాధారణంగా బిగ్​బాస్​ ఎలిమినేషన్స్​ అనేవి.. ప్రజల ఓట్లను బట్టి డిసైడ్​ చేస్తారు. ఆడియన్స్​ ఎవరికైతే తక్కువ ఓట్లు వేస్తారో వారు ఎలిమినేట్​ అవుతారు. అయితే గత కొన్ని సీజన్లు చూస్తే.. ఈ కంటెస్టెంట్​ మాకొద్దు అని ఆడియన్స్​ మొత్తుకున్నా.. బిగ్​బాస్​ టీమ్​ మాత్రం వారిని సేవ్​ చేసి వేరే వాళ్లని ఎలిమినేట్​ చేశారు. ఈ సీజన్​లో కూడా అదే జరిగింది. రెండో వారంలో శేఖర్​ బాషాకు ఓటింగ్​ బాగానే ఉన్నా.. హౌజ్​మేట్స్​ నిర్ణయంతో అతడిని ఎలిమినేట్​ చేశారు. ఇక నాలుగో వారంలో సోనియా లీస్ట్​లో ఉన్నా.. హౌజ్​మేట్స్​ నిర్ణయం అడిగారు నాగార్జున. దీంతో అందరూ సోనియాను ఎలిమినేట్​ చేయమని చెప్పారు. అలా ఆడియన్స్​, ఇంటి సభ్యుల నిర్ణయంతో సోనియాను ఇంటికి పంపించారు. ఒకవేళ హౌజ్​మేట్స్​ సోనియా ఉండాలని హ్యాండ్స్​ రైజ్​ చేస్తే మణికంఠ వెళ్లాల్సి వచ్చేది. దీంతో మిడ్​ వీక్​ ఎలిమినేషన్​ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఆడియన్స్ ఓట్లని లెక్కలోకి తీసుకొని లీస్ట్ ఉన్నవారిని బయటకు పంపిస్తారో లేక హౌజ్​మేట్స్ ఏకాభిప్రాయంతో ఎలిమినేట్ చేస్తారో చూడాలి.

అయితే నైనికకి ఎక్కువగా ఫ్యాన్ బేస్ లేకపోవడంతో తనకి ఓటింగ్ చాలా తక్కువగా ఉంది‌. ఆదిత్య ఓం ఒక ఊరిని దత్తత తీసుకోవడం.. వారి కోసం సపరేట్ అంబులెన్స్​ని ఏర్పాటు చేయడం.. ఇలా ఎవరికీ తెలియకుండా కొన్ని మంచి పనులు చేస్తున్న ఆదిత్య ఓం కి గ్రామాల నుంచి ఎక్కువగా సపోర్ట్ లభిస్తోంది.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.