ETV Bharat / entertainment

బాలయ్య - బోయపాటి 'బీబీ 4'లో విలన్​గా టాలీవుడ్ హీరో! - ఎవరంటే? - Balakrishna Boyapati BB4 Movie - BALAKRISHNA BOYAPATI BB4 MOVIE

Balakrishna Boyapati BB4 Movie Villian : బాలయ్య - బోయపాటి నుంచి రాబోయే కొత్త సినిమాలో ఓ టాలీవుడ్ హీరో విలన్​గా కనిపించబోతున్నారని సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?

source ETV Bharat
Balakrishna Boyapati BB4 Movie Villian (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 9:15 AM IST

Updated : Sep 7, 2024, 9:42 AM IST

Balakrishna Boyapati BB4 Movie Villian : ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస హిట్లతో కెరీర్​లో ఫుల్​ జోష్​లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన NBK 109 చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత ఆయన దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండబోతుందని అంటున్నారు. అలానే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉండనుందని, ఇందుకోసం ఓ హీరోను పవర్​ఫుల్​ విలన్‌గా తీసుకొచ్చేందుకు బోయపాటి ప్రయత్నిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు మొదలయ్యాయి.

అయితే తాజాగా ఈ చిత్రంలో బాలయ్యతో ఢీ కొట్టేందుకు ఓ టాలీవుడ్​ హీరో రెడీ అవుతున్నారని కొత్త ప్రచారం మొదలైంది. ఆ హీరో మరెవరో కాదు మ్యాచో స్టార్ గోపీ చంద్ అని బయట టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన సినిమాలు ఈ మధ్య ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అయితే గతంలో ఆయన విలన్​గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు హీరోగానే కొనసాగారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి విలన్‌గా మారబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​ మెంట్ రాలేదు. చూడాలి మరి ఇందులో నిజమెంతో.

Gopichand Srinu Vaitla Movie : గోపి చంద్ ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి విశ్వం అనే టైటిల్​ను ఖరారు చేశారు. టీజీ విశ్వ ప్రసాద్‌, వేణు దోనేపూడి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కావ్య థాపర్‌ హీరోయిన్​గా నటిస్తోంది.

మరోవైపు బాలయ్య దర్శకుడు బాబీతో కలిసి NBK 109 సినిమా చేస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ఓ కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, స్పెషల్​ సాంగ్​లో తమన్నా ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది.

'ఏసుబాయి'గా రష్మిక, 'రుక్మిణీ దేవి'గా రీతూ వర్మ​ - అందాల మహారాణులు విచ్చేస్తున్నారహో! - Actress in Historical Period films

'ప్లీజ్​ అలా అనొద్దు, అలాంటి పదాలు వాడొద్దు' : సంగీత దర్శకుడు తమన్‌ - Thaman GameChanger Movie

Last Updated : Sep 7, 2024, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.