ETV Bharat / entertainment

అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్​ - రజినీ స్టెప్పులు అదుర్స్! - Rajinikanth Dance

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 9:28 AM IST

Anant Radhika Wedding : రిలయన్స అధినేత ముకేశ్​ అంబానీ చిన్న కూమారుడు అనంత్, రాధిక మెర్చంట్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో రజినీకాంత్ తన డ్యాన్స్​తో అదరగొట్టాడు. ఆ వీడియో మీరూ చూసేయండి

Anant Radhika Wedding
Rajinikanth (Associated Press)

Anant Radhika Wedding : రిలయన్స అధినేత ముకేశ్​ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్​, నార్త్​ నుంచే కాకుండా అంతర్జాతీయ స్టార్స్ కూడా వచ్చి సందడి చేశారు. రెడ్​ కార్పెట్​పై ఫోజులిస్తూ కనిపించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఈవెంట్ మెత్తానికే స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు.

పెళ్లికొడుకు అనంత్ అంబానీ బారాత్ వస్తున్న సమయంలో సెలబ్రిటీలు అందరూ కారు ముందర డ్యాన్స్​ వేస్తూ కనిపించారు. అందులో జాన్ సీనా, సల్మాన్​ ఖాన్, షారుక్ ఖాన్​ లాంటి స్టార్స్ తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఆ సమయంలో రజినీ కూడా హుషారుగా స్టెప్పులేశారు. ప్రముఖ బాలీవుడ్ సాంగ్​కు సింపుల్​గా డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

సోలో ఫొటోషూట్​ - తలైవా స్వాగ్
ఇక ఈ వేడుకలో పలువురు సినీ, వ్యాపార, క్రీడా సెలబ్రిటీలు సందడి చేశారు. వారిని మీడియా పర్సన్​ ఫొటోలు తీశారు. ఇందులో భాగంగా రజినీ తన సతీమణి లత అలాగే చిన్నకుమార్తె సౌంద్యర, అలాగే అల్లుడు ఇంకా మనవడితో ఫొటో దిగారు. ఆ తర్వాత అక్కడి ఫొటోగ్రాఫర్లు ఆయన్ను సోలోగా నిల్చోమని అడిగారు. అప్పుడు ఆయన నడుముపై రెండు చేతులు పెట్టుకుని స్టైలిష్​గా ఫోజిచ్చారు. ఇది చూసి అక్కడి వారు తలైవా అంటూ అరవడం మొదలెట్టారు. ఈ వీడియో కూడా అంబానీ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.

మహేశ్ న్యూ లుక్​ - ఇంటర్నెట్ షేక్
మరోవైపు ఈ వేడుకకు టాలీవుడ్​ నుంచి రామ్​చరణ్ దంపతులు, రానా దంపతులు, విక్టరీ వెంకటేశ్, మహేశ్​ బాబు దంపతులు హాజరయ్యారు. ముఖ్యంగా మహేశ్ బాబు తన న్యూ లుక్​తో ఆకట్టుకున్నారు. బ్లూ కలర్​ డ్రెస్​లో రగ్గ్​డ్ లుక్​తో స్పెషల్​గా కనిపించారు. మహేశ్ ఫ్యాన్స్ ఈ లుక్​కు సూపర్ రేటింగ్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

అంబానీ ఇంట తారల సందడి- స్పెషల్ అట్రాక్షన్ వీళ్లే!- HD పిక్స్ చూశారా? - ANANT RADHIKA WEDDING PHOTOS

అనంత్- రాధిక సంగీత్​ : సినీ, క్రికెటర్ల సందడి మధ్య అంబానీ స్పెషల్ సాంగ్ - Anant Radhika Pre Wedding Ceremony

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.