ETV Bharat / entertainment

'ప్రభాస్​కు అదంతా రొటీన్ - నాకు మాత్రం వెరీ స్పెషల్' - Kalki 2898 AD Amitabh Bachan

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 1:48 PM IST

Kalki 2898 AD Amitabh Bachan : 'కల్కి' చిత్రానికి వస్తోన్న ఆదరణపై హర్షం వ్యక్తం చేసిన అమితాబ్ బచ్చన్ ప్రభాస్​పై ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Kalki 2898 AD Prabhas Amitabh Bachan (source ETV Bharat)

Kalki 2898 AD Amitabh Bachan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ - ఇప్పుడీ పేరు వింటే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే అనేంతగా ఆయన రేంజ్ మారిపోయింది. రీసెంట్​గా ఆయన నటించిన కల్కి 2898 ఏడీ భారీ వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ మధ్యే రూ.1000 కోట్ల క్లబ్​లోకి కూడా అడుగుపెట్టేసింది. దీనిపై మూవీటీమ్​​ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకుంటోంది. తాజాగా అమితాబ్​ కూడా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా కల్కికి వస్తోన్న సూపర్ రెస్పాన్స్​పై సంతోషం వ్యక్తంచేశారు. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో భాగమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆడియెన్స్​ అభిమానం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి సక్సెస్‌లు ప్రభాస్‌కు రొటీన్‌ అయిపోయాయని, ఈ మధ్య కాలంలో ఆయన నటించిన పలు చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వచ్చాయని చెప్పారు. "నా వరకు ఇలాంటి గొప్ప చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందిస్తున్నాను. అసలు ఎంతగా ఎంజాయ్‌ చేశానో చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇప్పటికే నాలుగు సార్లు మూవీని చూశాను. సినిమా చూసిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాను" అని అన్నారు. అలానే చిత్రాన్ని నిర్మించిన నాగ్‌ అశ్విన్‌ విజన్‌, అశ్వనీదత్‌, ప్రియాంక, స్వప్న పనితీరుపై ప్రశంసలు కురిపించారు.

కాగా, ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన కల్కి ఇంకా థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతోంది. బాక్సాఫీస్ ముందు కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తోంది. మూవీలో దిగ్గజ నటులు అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్‌హాసన్‌ సుప్రీంయాస్కిన్‌గా నటించగా, విజయ్‌ దేవరకొండ (అర్జునుడు), దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రల్లో మెరిశారు. వీరి పాత్రలకు మంచి క్రేజ్ వచ్చింది. ఇంకా చిత్రంలో మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్ కూడా కనిపించారు. పార్ట్ 2లో నాని, నవీన్ పొలిశెట్టి కూడా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రభాస్​ బౌంటీ ఫైటర్‌ భైరవగా కనిపంచారు. ఇక చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్‌-2పై మరిన్ని అంచనాలను పెంచేశారు.

'విడుదలై' ఫస్ట్ లుక్ రిలీజ్​ - షేక్ చేస్తున్న విజయ్​ సేతుపతి విశ్వరూపం - Viduthalai Part 2 Posters

కార్తి 'సర్దార్‌ 2' సెట్‌లో ప్రమాదం - అతడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.