ETV Bharat / entertainment

'కల్కి'నే మించేలా త్రివిక్రమ్​-బన్నీ ప్లాన్ - డబ్బులు వెతుక్కొనే పనిలో అల్లు అరవింద్! - Alluarjun Trivikram Movie

Alluarjun Trivikram Movie Budget : త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పారు నిర్మాత బన్నీ వాసు. పూర్తి వివారలు స్టోరీలో.

source ETV Bharat
Alluarjun Trivikram Movie Budget (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 1:40 PM IST

Alluarjun Trivikram Movie Budget : జులాయి, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్స్​ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ - బన్నీ కలిసి ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పుష్ప రెండు భాగాలుగా రావడం వల్ల ఇది ఆలస్యమైంది. పైగా మధ్యలో అట్లీ సహా ఇతర దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.

అయితే ఇప్పుడు పుష్ప 2 దాదాపుగా చివరి దశకు చేరుకోవడంతో నెక్స్ట్​ బన్నీ ఎవరితో సినిమా చేస్తారా అన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్‌ పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు నిర్మాత బన్నీ వాసు. అయితే ఈ సినిమా బడ్జెట్​ కోసం అల్లు అరవింద్ డబ్బులు చూసుకోవాలని అన్నారు.

"అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లైన్ ఫిక్స్ అయిపోయింది. కానీ అది భారీ బడ్జెట్ మూవీ. ఆ మూవీ చేయడానికి అల్లు అరవింద్, చినబాబు ఫైనాన్షియర్లను, కార్పొరేటర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. అంత భారీ బడ్జెట్​తో రానున్న చిత్రమిది. త్రివిక్రమ్​కు పాన్ ఇండియా మూవీ చేయగల సామర్థ్యం ఉందని బన్నీకి బాగా నమ్మకం ఉంది. వీరిద్దరూ ఎప్పుడో రెండేళ్ల క్రితమే మాట్లాడుకొని ఒక కాన్సెప్ట్​ను ఫిక్స్ చేసుకున్నారు. అయితే దీని బడ్జెట్‌కు, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్​కు ఏడాది లేదా ఏడాదిన్నార సమయం పడుతుంది. దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికే అంత సమయం పడుతుంది. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్." అంటూ బన్నీ వాసు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మాటలు విన్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు.​ టాలీవుడ్‌లో బడా నిర్మాతలైన అల్లు అరవింద్, చినబాబు (రాధాకృష్ణ) లాంటి వారే ఫైనాన్షియర్లను వెతుక్కోవాలి అంటే ఈ సినిమా ఏ రేంజ్‌లో చేయబోతున్నారా అని అంటున్నారు. కల్కి రేంజ్‌లో రూ.600 కోట్లు పెట్టి తీస్తారా ఏంటి అని అడుగుతున్నారు.

Alluarjun Trivikram New Movie Concept : కాగా, ఈ సినిమాను మైథాలజీ కాన్సెప్ట్​తో తీస్తారని ఆ మధ్య ప్రచారం సాగింది. ఎలాగో త్రివిక్రమ్​ కూడా పురాణాలు, రామాయణం, మహాభారతాలపై పట్టున్నట్లే వ్యవహరిస్తుంటారు. తన సినిమాల్లో వీటికి సంబంధించి రిఫరెన్స్‌ తీసకొని పంచ్ డైలాగులు పెడుతుంటారు. పైగా ప్రస్తుతం మైథాలజీ బ్యాక్​డ్రాప్​తో వస్తున్న సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. బ్రహ్మస్త్రం, కల్కి ఆ కోవకు చెందినవే. దీంతో త్రివిక్రమ్ - బన్నీ మైథాలజీ కాన్సెప్ట్‌నే ప్లాన్ చేశారేమోనని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి : 'కల్కి' సీన్స్​పై అమితాబ్‌

న‌ర‌కాసురిడిని వధించేందుకు నాని రెడీ - పవర్​ఫుల్​గా 'సరిపోదా శనివారం' టీజర్ - Saripodhaa Sanivaaram Teaser

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.