ETV Bharat / entertainment

అల్లు ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్- అయాన్, అర్హానే స్పెషల్ అట్రాక్షన్ - Allu Arjun Wax Statue - ALLU ARJUN WAX STATUE

Allu Arjun Wax Statue Madame Tussauds: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్​నకు సంబంధించిన ఫొటోలను ఆయన సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Allu Arjun Wax Statue Madame Tussauds
Allu Arjun Wax Statue Madame Tussauds
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 9:43 PM IST

Allu Arjun Wax Statue Madame Tussauds: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఆ షూట్​కు కాస్త బ్రేక్ ఇచ్చి ఆయన తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్​కు వెళ్లారు. సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ఉంచే ప్రతిష్టాత్మక మేడమ్​ టుస్సాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన బన్నీ, పిల్లలు అయాన్, అర్హతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ దుబాయ్ ట్రిప్​కు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి వరల్డ్​ మోస్ట్ ఫేమస్ బుర్జ్ ఖలీఫాకు కూడా వెళ్లారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫొటోల్లో అయాన్, అర్హ స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. ఓ షాపింగ్ మాల్​లో హుషారుగా తిరిగేస్తూ అల్లరి చేశారు. ఫొటోలు చూసిన అల్లు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అల్లు స్నేహ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ
అల్లు స్నేహ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీ

ఇప్పటి వరకు టుసాడ్స్​లో సందడి చేసిన టాలీవుడ్​ సినీ తారలు వీరే :
ఇక ప్రపంచంలోని పలు నగరాల్లో ఉన్న ప్రముఖ టుస్సాడ్ మ్యూజియంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటుల విగ్రహాలు ఆవిష్కరించారు. అందులో బ్యాంకాక్​ మ్యూజియంలో రెబల్​స్టార్ ప్రభాస్, సింగపూర్​లోని మ్యూజియంలో ప్రిన్స్ మహేశ్ బాబు విగ్రహాలు ఆవిష్కరించారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్​కు సైతం ఈ గౌరవం దక్కింది. సింగపూర్​లోని టుస్సాడ్ మ్యూజియంలో 2020లో కాజల్ విగ్రహావిష్కరణ జరిగింది. కాగా, సౌత్​ ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఈ గౌరవం దక్కిన తొలి నటిగా కాజల్ రికార్డు కొట్టింది.

ఆ రికార్డులో టాప్​ :
తాజాగా మరో సంచలనం క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్​లో సౌతిండియా హీరోలెవరికీ సాధ్యం కానీ ఫీట్​ను సాధించాడు బన్నీ. అదేంటంటే ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్​లో ఐకాన్ స్టార్​ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 25 మిలియన్లు దాటింది. ఆ విధంగా దక్షిణాదిలో 25 మిలియన్ల ఫాలోవర్స్​ను కలిగిన మొదటి, హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. తర్వాత స్థానంలో 21.3 మిలియన్లతో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ 20.8. దుల్కర్ సల్మన్ 14.1, 11.7 ప్రభాస్, 10.8 మిలియన్లతో దళపతి విజయ్ ఉన్నారు. ఇంతమంది స్టార్ హీరోలను దాటుకుని టాప్​లో నిలిచారు అల్లు అర్జున్.

బాలీవుడ్ వర్సెస్​ సౌత్ ఇండస్ట్రీ - ఐకాన్ స్టార్​ రియాక్షన్ ఇదే

అల్లు అర్జున్​తో పాన్ ఇండియా సినిమా! అట్లీ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.