Alia Bhatt Love And War Movie shooting : బాలీవుడ్ భామ అలియా భట్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే 'ఆల్ఫా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే లవ్ అండ్ వార్ అనే చిత్రాన్ని చేయనుంది. ఈ సినిమా మరి కొద్దిరోజుల్లోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నవంబరులో 'ఆల్ఫా' షూటింగ్‌ను పూర్తి చేసి డిసెంబరులో ఈ కొత్త మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టనుందట అలియా. సినిమాలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Ajay Devgn Desi Indiana Jones : ఇప్పటి వరకు ప్రేమ కథలు, యాక్షన్ మూవీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన అజయ్ దేవగణ్ ఈ సారి మునుపెన్నడూ పోషించని ఓ సరికొత్త పాత్రతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఇప్పుడు యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం అందింది. జగన్ శక్తి దర్శకుడు. 'ఇండియానా జోన్స్' సిరీస్ తరహాలో దీన్ని రూపొందిస్తున్నారట. ఇందులో అజయ్ ఓ ధైర్యవంతుడైన ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నారని తెలిసింది. లవ్‌రంజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. షూటింగ్ డిసెంబరులో ప్రారంభించనున్నారని తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం అజయ్ 'దే దే ప్యార్ దే 2', 'రైడ్ 2', 'సింగమ్ అగైన్' సహా పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Kareena Kapoor The Buckingham Murders : బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ డిటెక్టివ్‌గా మారింది. ఓ హత్య కేసుకు సంబంధించి హంతకులను పట్టుకోవడంలో నిమగ్నమైంది. మరి ఈ భామ ఈ కేసును చేధించిందా? లేదా అనేది తెలియాలంటే 'ది బకింగ్ హామ్ మర్డర్స్' చూడాల్సిందే. ఆమె మెయిన్ రోల్లో నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు హన్సల్ మెహతా దర్శకుడు. రీసెంట్గా రిలీజైన టీజర్ మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంది. డిటెక్టివ్ జస్మిత్ భమ్రా రహస్యాలను బయట పెట్టే మార్గంలో ఉంది అంటూ తాజాగా విడుదలైన పోస్టర్ కూడా ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి కరీనా కపూర్. శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా వచ్చే నెల 13న రిలీజ్ కానుంది.
Akshay Kumar Sky Force PostPone : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కపూర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'స్కై ఫోర్స్'. "ఎవరైనా మన దేశాన్ని అణిచివేయాలనుకున్నా, లొంగదీసుకోవాలని ప్రయత్నించినా, హిందూస్థాన్ మౌనంగా ఉండదు" అంటూ అక్షయ్ కుమార్ ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేశారు. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబరు 2న ఇది రిలీజ్ కావాలి. కానీ ఇప్పుడీ మూవీ రిలీజ్ ఆలస్యం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
Nawazuddin Siddiqui Adbhut OTT : బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అద్భుత్. సబ్బీర్ ఖాన్ దర్శకుడు. శ్రేయా ధన్వంతరి, డయానా పెంటీ, రోహన్ మెహ్రా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. "నమ్మకాన్ని మించినదే నిజం" అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసింది. ఇందులో ఓ రహాస్యాన్ని చేధించే డిటెక్టివ్ పాత్రలో నవాజుద్దీన్ కనిపించనున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చే నెల 15న ఓటీటీ వేదికగా రిలీజ్ చేయనున్నారు.
'తంగలాన్' దర్శకుడితో సూర్య - పొల్లాచ్చిలో వెంకీ పాట - Thangalan Director Suriya Movie
టాలీవుడ్‌కు కొత్త అందాలు - నందమూరి వారసుల కోసం ఇద్దరు భామలు - Tollywood Upcoming New Heroines