Ali Fazal Movies : అలీ ఫజల్ అంటే అంతగా తెలియకపోవచ్చుగానీ మీర్జాపుర్ ఫ్యాన్స్‌కు మాత్రం గుడ్డూ భాయ్ అనే చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆయన అసలు పేరు కంటే స్క్రీన్ నేమ్‌తోనే అంత ఫేమస్ అయ్యారు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ యన నటనతో ప్రశంసలు పొందారు. ప్రస్తుతం మీర్జాపుర్ 3లో కీ రోల్ ప్లే చేసి మరోసారి అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. అయితే ఈయన నటించిన మరిన్ని బెస్ట్ సినిమాలను ఓ లుక్కేయండి.
ఆల్వేస్ కభీ కభీ (2011)
'ఆల్వేస్ కభీ కభీ' మూవీ ఫైనల్ స్కూల్ ఇయర్‌లో ఉన్న నలుగురు టీనేజర్ల జీవితాల చుట్టూ తిరిగే కథ. ఈ కామెడీ మూవీలో అలీ ఫజల్, సామ్ అలీయాస్ సమీర్ ఖన్నాగా నటించారు. ఆయన చేసే కామెడీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ జియో సినిమాలో అందుబాటులో ఉంది.
3 ఇడియట్స్(2009)
3 ఇడియట్స్ మూవీలో ఒత్తిడిని ఎదుర్కొనే సీనియర్ విద్యార్థి జాయ్ లోబోగా అలీ ఫజల్ నటించారు. చిన్న పాత్ర అయినా ఇది అందరికీ గుర్తుండిపోతుంది. ఇందులో తన నటనకుగానూ ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అమోజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉంది.
మిలన్ టాకీస్ (2019)
ఇందులో ఓ లోకల్ ఫిల్మ్ మేకర్ తాను ప్రేమించే అమ్మాయి పరీక్షల్లో పాస్ కావడానికి సాయం చేస్తారు. అలీ ఫజల్ అన్నూ అనే పాత్రలో అలరించారు. మీరు ఈ సినిమాని యూట్యూబ్‌లో చూడొచ్చు.
హౌస్ అరెస్ట్ (2019)
హౌస్ అరెస్ట్ సినిమాలో కరణ్‌గా అలీ ఫజల్ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఇందులో డిప్రెషన్లో ఉన్న వ్యక్తి తనని తాను ఇంటికే పరిమితం చేసుకునే రోల్‌లో ఆకట్టుకున్నారు. ఆయనకు ఇంటి పక్కన ఉండే వ్యక్తి అయిన ఓ జర్నలిస్టుతో ఇబ్బంది ఎదురవుతుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఫుక్రే (2013)
అలీ సినీ కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌గా మారిన మూవీ 'ఫుక్రే'. ఈ సినిమాలో తన నటనకుగానూ ప్రశంసలు అందుకోగా, ఈ మూవీ సీక్వెల్స్ అయిన 'ఫుక్రే రిటర్న్స్ , 'ఫుక్రే 3'ల్లోనూ అత్యద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఫజల్ స్థానాన్ని పదిలం చేసింది. మూవీ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. IMDB రేటింగ్ 6.9/10గా ఉంది.
బాబీ జాసూస్ (2014)
అలీ ఫజల్, విద్యా బాలన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇది. హైదరాబాద్‌లో డిటెక్టివ్ కావాలనుకునే బాబీ అనే మహిళ పట్ల అభిమానాన్ని పెంచుకునే తసవ్వూర్ షేక్‌గా అలీ నటన ఆకట్టుకుంటుంది. ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
సోనాలి కేబుల్ (2014)
తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కష్టపడి పనిచేసే ఓ ఇంటర్నెట్ ఆపరేటర్ చుట్టూ తిరుగుతుంది. తన మిషన్‌లో భాగమయ్యే చిన్ననాటి క్లాస్‌మేట్ రఘు పవార్‌గా అలీ ఫజల్ యాక్ట్ చేశారు. ఫజల్ నటనకు చాలా మంచి పేరు లభించింది. ఈ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
హ్యాపీ భాగ్ జాయేగీ(2016)
ఈ కామెడీ రొమాంటిక్ మూవీలో హ్యాపీ అనే మహిళ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో చిక్కుకుంటుంది. మాజీ గవర్నర్ కొడుకు అలీ ఫజల్ పాత్రను కలుసుకుంటుంది.ఆమెను తన బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగి కలిపే పాత్రలో అలీ ఫజల్ ఆకట్టుకున్నాడు. మూవీ జియో సినిమాలో, జీ5లో అందుబాటులో ఉంది.
తడ్కా(2022)
తడ్కా అనేది మలయాళం సినిమా "సాల్ట్ ఎన్ పెప్పర్"కి హిందీ రీమేక్. అలీ ఫజల్ ఓ ఫోన్ కాల్ ద్వారా మహిళ ప్రేమలో పడే వ్యక్తిగా నటిస్తారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ మూవీని జీ5లో చూడవచ్చు.
ఖుఫియా (2023)
అలీ ఫజల్ లేటెస్ట్ సినిమాల్లో ఖుఫియా ఒకటి. భారతదేశ రహస్యాలను విక్రయించిన ద్రోహిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న రా ఏజెంట్ చుట్టూ సినిమా ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీలో కెప్టెన్ రవి దేవిలాల్ మోహన్ పాత్రలో ఫజల్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.