ETV Bharat / entertainment

డూప్​ లేకుండా కారు స్టంట్​ - అజిత్​ డెడికేషన్​కు ఫ్యాన్స్​ ఫిదా - Ajith Kumar Car Stunt

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 3:45 PM IST

Updated : Apr 4, 2024, 4:18 PM IST

Ajith Kumar Car Stunt : కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ ప్రస్తుతం విడాముయర్చి షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ఓ సాహసోపేతమైన కారు స్టంట్​ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో మీ కోసం

Ajith Kumar Car Stunt
Ajith Kumar Car Stunt

Ajith Kumar Car Stunt : కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ ప్రస్తుతం విడాముయర్చి షూటింగ్​లో బిజీగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈ మూవీ చిత్రీకరణకు ఎన్నో సార్లు బ్రేక్ పడినప్పటికీ మేకర్స్ వేగం పుంజుకుని మరీ షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. " ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అందులో అజిత్​ కుమార్​ డూప్​ లేకుండా ఓ డేెంజరస్​ స్టంట్ చేశారు.

ఓ ఏడారిలో షూట్ చేసిన ఆ సీన్​లో అజిత్​ ఎంతో సాహసోపేతంగా కారు నడిపారు. ఆ కారు కాస్త రోడ్డు పక్కునున్న ఎడారిలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇందులో అజిత్​తో పాటు ఆరవ్ అనే మరో నటుడు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, అజిత్ అభిమానులు తనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతడి డేరింగ్​కు హ్యాట్సాఫ్​ చెప్తున్నారు. ఐదు పదుల వయసులోనూ తన ఎనర్జీటిక్​ మూవ్స్​ చూసి ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆయన గతంలో తన సినిమాల్లో చేసిన స్టంట్స్​ గురించి చెప్పుకుంటున్నారు.

ఇక విడాముయర్చి సినిమా విషయానికి వస్తే - యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తుండగా ప్రియ భవానీ శంకర్‌, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ డైరెక్టర్ మగిళ్‌ తిరుమేని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లైకా సుబాస్కరన్ తన సొంత బ్యానర్​ లైకా ప్రొడక్షన్స్​పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమాలోనూ అజిత్​ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ అభిమానుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.

అనారోగ్యం రూమర్స్​కు చెక్​ - అజిత్​కు అసలు ఏం జరిగిందంటే ?

ఒకే స్క్రీన్​పై అజిత్​-ఐశ్వర్య.. 22ఏళ్ల తర్వాత!

Last Updated : Apr 4, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.