ETV Bharat / entertainment

గాయంతో కేన్స్​కు ఐశ్వర్య - డెడికేషన్ అలాంటిది మరి! - Cannes Film Festival 2024 - CANNES FILM FESTIVAL 2024

Aishwarya Rai Bachchan Cannes : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవలె ముంబయి ఎయిర్​పోర్ట్​లో తన కుమార్తెతో కలిసి కనిపించింది. అయితే ఆమె చేతికి బ్యాండేజ్ ధరించి కనిపించింది. ఇంతకీ ఏమైందంటే?

Aishwarya Rai Bachchan
Aishwarya Rai Bachchan (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 10:41 AM IST

Aishwarya Rai Bachchan Cannes : ఫ్రాన్స్‌ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్​కు హాజరై సందడి చేస్తున్నారు. భారత్​ నుంచి కూడా పలువురు స్టార్స్ కూడా రెడ్​ కార్పెట్​పా తళుక్కుమన్నారు. దీంతో ఆ వేడుకపై అభిమానుల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఎప్పుడూ ఈ ఈవెంట్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ సారి కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

అయితే తాజాగా ఆమె తన కుమార్తె ఆరధ్యతో కలిసి కేన్స్ ఫెస్టివల్​కు హాజరయ్యేందుకు బయలుదేరింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్​పోర్ట్​లో మెరిసింది. కేన్స్ ఫెస్టివల్ అయితే ఐశ్వర్య చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్​వెల్​ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గాయంతోనూ కేన్స్ వస్తున్న ఆమె పట్టుదలను కొనియాడుతున్నారు.

ఇక ఐష్ ప్రతి ఏడాది కేన్స్​లో తళుక్కున మెరుస్తుంటారు. విభిన్నమైన కాస్ట్యూమ్స్​తో కనిపించి అలరిస్తారు. దీంతో ఈ సారి ఆమె ఎటువంటి కాస్ట్యూమ్​లో రానుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అభిమానులను నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆమె ఎలా కనిపిస్తారో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయంతో ఆమె ఈ వేడుకకు హాజరవ్వగలదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్​లో పలువు హాలీవుడ్​, ఇండియన్ సినీ తారలు, సెలబ్రిటీలు తమ కొత్త డిజైనర్‌ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. భారత్​ నుంచి ఇప్పటికే ఊర్వశీ రౌతేలా పింక్ కలర్‌ స్టైలిస్‌ డ్రెస్సులో మెరిశారు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ గ్రాండ్ వేడుకల్లో ఐశ్వర్య రాయ్​తో పాటు అదితి రావు హైదరీ, శోభితా ధూళిపాళ్ల, బీటౌన్ బ్యూటీ కియారా అడ్వాణి కనిపించనున్నారు. వీరందరూ కూడా అక్కడే కొద్ది రోజులు గడపనున్నట్లు సమాచారం.

కేన్స్​లో కియారా - ప్రతిష్టాత్మక ఈవెంట్​లో రెడ్​కార్పెట్​పై సందడి - Cannes Film Festival 2024

కేన్స్​ ఫిల్మ్ ఫెస్టివల్: స్క్రీనింగ్ కాంపిటీషన్​లో​ ఇండియన్ మూవీ- 30ఏళ్లలో ఇదే తొలిసారి - Cannes Film Festival 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.