ETV Bharat / entertainment

'డ్రెస్‌ మార్చుకుంటుంటే అలా చేశారు' - నిర్మాతపై నటి సంచలన కామెంట్స్‌! - Krishna Mukherjee - KRISHNA MUKHERJEE

Actor Krishna Mukherjee Harassment Allegations : ఓ నటి నిర్మాతపై సంచలన కామెంట్స్ చేసింది. షూటింగ్‌ సమయంలో తీవ్రంగా వేధించాడని తెలిపింది. అసలేం జరిగిందంటే?

Krishna Mukherjee
Krishna Mukherjee
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 5:20 PM IST

Actor Krishna Mukherjee Harassment Allegations : సినీ, టీవీ పరిశ్రమలో చాలా సార్లు వేధింపుల ఆరోపణలు వింటుంటూనే ఉంటాం. అయితే తాజాగా 'యే హై మొహబ్బతే' డిజిటల్‌ సిరీస్‌తో పాపులర్ అయిన హిందీ బుల్లితెర నటి కృష్ణ ముఖర్జీ కూడా అలాంటి ఆరోపణలే చేసింది. ప్రస్తుతం తాను షూటింగ్​లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం డిప్రెషన్‌ అని చెప్పింది. అలానే కొత్త ప్రాజెక్టులు తీసుకోవడానికి కూడా భయమేసిందని, అందుకు శుభ్‌ షగున్‌ సిరీస్​ నిర్మాతలే అసలు కారణమని షాకింగ్ కామెంట్స్​ చేసింది. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాలను, నిర్మాతలు పెట్టిన ఇబ్బందులను బయటపెట్టింది.

ఈ పోస్ట్​లో 'శుభ్ షగున్' సెట్‌లో ఎదురైన షాకింగ్ విషయాలను కృష్ణ ముఖర్జీ షేర్‌ చేసుకుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు మేకప్ గదికి పరిమితం కావడం, ఐదు నెలలుగా పేమెంట్స్‌ అందుకోకపోవడం వంటి బాధాకరమైన సంఘటనలను వివరించింది. నిర్మాత నుంచి బెదిరింపులు వచ్చాయని, అన్‌సేఫ్‌గా ఫీల్‌ అయి, ఇలాంటి అనుభవమే మళ్లీ ఎదురవుతుందనే భయంతో కొత్తగా ఏ ప్రాజెక్టులూ తీసుకోలేదని పేర్కొంది.

  • అప్పటి నుంచి డిప్రెషన్‌లో ఉన్నా - ఇన్‌స్టాలో కృష్ణ ముఖర్జీ చేసిన పోస్టులో - ‘నా మనసులోని విషయాలను బయటకు చెప్పే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు. కానీ ఇంకా విషయాలను దాయకూడదని నిర్ణయించుకున్నాను. గడిచిన ఒకటిన్నార సంవత్సరం చాలా కష్టంగా అనిపించింది. నేను డిప్రెషన్‌కు గురయ్యాను. ఆందోళనతో గుండెలవిసేలా ఏడ్చాను. నేను దంగల్ టీవీకి శుభ్ షగున్ చేయడం వల్లే ఇదంతా జరిగింది. ఆ షో చేయడం నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం. నాకు అది చేయాలని లేదు. కానీ ఇతరుల మాటలు విని అగ్రిమెంట్‌పై సంతకం చేశాను. ప్రొడక్షన్ హౌస్, నిర్మాత @kundan.singh.official నన్ను చాలా సార్లు వేధించారు' అని రాసుకొచ్చింది.
  • మళ్లీ అలా జరుగుతుందని భయం - 'వాళ్లు ఒకసారి నన్ను నా మేకప్ రూమ్‌లో లాక్ చేసారు. అప్పుడు నా ఆరోగ్యం బాలేదు. పైగా వాళ్లు పేమెంట్స్‌ సక్రమంగా చెల్లించడం లేదు. అందుకే ఆరోజు షూట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకుంటుంటే, మేకప్ రూమ్‌ తలుపులను విరగ్గొట్టేలా బాదారు. 5 నెలలుగా పేమెంట్స్‌ క్లియర్ చేయలేదు. నేను ప్రొడక్షన్‌ హౌస్‌కు, దంగల్‌ ఆఫీస్‌కు వెళ్లినా పట్టించుకోలేదు. చాలా సార్లు ధమ్కీ కూడా ఇచ్చారు. నేను అన్‌సేఫ్‌గా ఫీల్‌ అయ్యాను. చాలా భయపడ్డాను. చాలా మంది వ్యక్తుల నుంచి సహాయం అడిగాను. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సిరీస్‌లు ఎందుకు చేయడం లేదని చాలా మంది అడుగుతున్నారు. ఇదే కారణం. మళ్ళీ అలాంటిదే జరుగుతుందని నాకు భయంగా ఉంది ?? ఐ నీడ్‌ జస్టీస్‌.' అని వివరించింది.

కాగా, కృష్ణ పోస్ట్ చేసిన వెంటనే, ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆమెకు సపోర్ట్‌ అందించారు. కొందరు ఆమె ధైర్యంగా బయటకు చెప్పినందుకు ప్రశంసించారు. ఆమె త్వరలో కోలుకోవాలని, త్వరలో ఆమె మరిన్ని సిరీస్‌లలో నటించాలని నెటిజన్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే 'నాగిన్', 'కుచ్ తో హై.' సిరీస్‌లలో కూడా కృష్ణ మంచి పేరు తెచ్చుకుంది.

పవర్​ స్టార్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​​ - ఎన్నికల ముందే ఆ సినిమా రిలీజ్​! - Pawankalyan Rerelease Movie

ప్రముఖ నటుడు మిస్సింగ్​ - ఆందోళనలో ఫ్యాన్స్! - Gurucharan Singh Missing

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.