Pushpa Gangamma Jatara : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అందులో భాగంగానే శుక్రవారం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ మీట్లో పాల్గొన్న హీరో అల్లు అర్జున్ సినిమాలోని గంగమ్మ జాతర ఎపిసోడ్లో ఆయన గెటప్ గురించి మాట్లాడారు.
నిజానికి అమ్మవారి గెటప్ ఫొటో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. బన్నీని అలా అమ్మవారి గెటప్‌లో చూపించాలనన్నది పూర్తిగా సుకుమార్ ఆలోచనే అంట. దీని వెనకాల జరిగిన కథను బన్నీ తాజా ప్రెస్మీట్లో వివరించారు. 'ఈ ఒక్క ఫొటో పుష్ప 2 రేంజ్ పెంచేసింది. ఇది పూర్తిగా సుకుమార్ ఆలోచనే. ముందుగా పుష్ప క్యారెక్టర్‌ను రిచ్ లుక్‌లో చూపించాలని భావించాం. అందుకు తగ్గట్లుగా సూట్, సఫారీ ధరించి ఫొటోషూట్ చేశాం. ఔట్పుట్ కూడా బాగా వచ్చింది. కానీ, సుకుమార్ మాత్రం సంతృప్తి చెందలేదు.
ఆయన ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. వెంటనే లేడీ గెటప్ వేయాలని నన్ను అడిగారు. అది విన్న నేను షాక్ అయ్యాను. అప్పుడు ఆ గెటప్ గురించి తన విజన్ నాకు వివరించారు. నేనూ తనపై నమ్మకంతో ఓకే చెప్పేశాను. కానీ, ఆ మేకోవర్ కోసం చాలా కష్టపడ్డాం. తొలి రెండు రోజులు ఫొటోషూట్ ఫెయిల్ అయ్యింది. అనుకున్న ఔట్పుట్ రాలేదు. చివరగా మూడో రోజు అనుకున్న గెటప్ సాధించాం. అప్పుడు నాకు అర్థమైంది సుకుమార్‌కు ఏం కావాలో అని. అతను ఓ జీనియస్' అని బన్నీ లేడీ గెటప్ స్టోరీని వివరించారు.
కాగా, ఈ జాతర సీన్‌పై మేకర్స్ ఎంతో కేరింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జాతర ఎపిసోడ్ షూటింగ్‌లో దాదాపు 2000మంది జూనియర్లు, 200మంది డ్యాన్సర్లు పాల్గొన్నట్లు రీసెంట్గా కొరియోగ్రాఫర్ విజయ్ చెప్పారు. ఈ సీక్వెన్స్ కోసం 30రోజులకు పైగానే పట్టిందట. స్పెషల్ మేకప్, లైటింగ్ సెటప్స్, ఆర్ట్ వర్క్, మోకోబాట్ కెమెరాతో షూట్ చేసినట్లు తెలిసింది. ఓవరాల్‌గా ఈ ఒక్క ఎపిసోడ్‌కు రూ.50 నుంచి 60 కోట్ల దాకా ఖర్చైనట్లు సమాచారం.
యూఎస్‌లో పుష్పగాడి రూల్- వైల్డ్ ఫైర్ దెబ్బకు 45 వేల ప్లస్ టికెట్స్ సేల్!
'పుష్ప 2' తెలుగు ఈవెంట్ డేట్ ఫిక్స్- స్పెషల్ గెస్ట్ సుక్కూనే!